దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న లేటెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. తొలిసారిగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు కలిసి నటిస్తున్న ఈ సినిమాని డివివి ఎంటరైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్నారు. ఇంతకముందు బాహుబలి రెండు భాగాల సినిమాలతో ఎంతో గొప్ప ఇండస్ట్రీ హిట్స్ అందుకుని ప్రపంచ దేశాల ప్రేక్షకులు, సినిమా పరిశ్రమల దృష్టిని కూడా ఎంతో ఆకర్షించిన రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావడంతో దీనిపై అన్ని దేశాల్లో కూడా ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ కొమరం భీంగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న ఈ సినిమాలో ఒలీవియా మోరిస్, ఆలియా భట్ హీరోయిన్స్ గా నటిస్తుండగా కీరవాణి సంగీతాన్ని, సెంథిల్ కుమార్ ఫొటోగ్రఫీని అందిస్తున్నారు.

బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని, శ్రియ శరణ్, రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ కనబడుతోంది.

ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి, ఇందులో ఒక ప్రత్యేక పాత్రలో టాలీవుడ్ కి చెందిన స్టార్ నటి ఒకరు నటిస్తున్నారని, సినిమాలో కేవలం కొన్ని క్షణాలు మాత్రమే ఆమె పాత్ర ఉన్నప్పటికీ, దాని ఇంపాక్ట్ సినిమా మొత్తం ఉంటుందని, అందుకే సదరు నటి ఆ రోల్ చేయడానికి ఒప్పుకున్నారని అంటున్నారు. అయితే ఆ పాత్రని చేస్తున్న నటి ఎవరు అనే విషయమై మాత్రం ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ టీమ్ గోప్యంగా ఉంచిందని, అది కేవలం సినిమా రిలీజ్ తరువాతనే తెలిసే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే, ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: