నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన పటాస్ సినిమా ద్వారా టాలీవుడ్ కి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన యువ దర్శకడు అనిల్ రావిపూడి, అంతకముందు పలు సినిమాలకు కథా రచన చేయడంతో పాటు అక్కడక్కడా మరికొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేసారు. అయితే ఎట్టకేలకు పటాస్ తో మెగాఫోన్ పట్టిన అనిల్, తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. శృతి సోది హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని అనిల్ రావిపూడి తెరకెక్కించిన స్టైల్ ప్రేక్షకాభిమానులను ఎంతో ఆకట్టుకుంది.

ఇక దాని అనంతరం మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో సుప్రీం సినిమా తీసి మరొక హిట్ కొట్టిన అనిల్, ఆపై మాస్ రాజా రవితేజ హీరోగా తెరకెక్కిన రాజా ది గ్రేట్ మూవీ తీశారు. రవితేజ అంధుడిగా పలు కమర్షియల్ హంగుల మేళవింపుగా తెరకెక్కిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుని దర్శకుడిగా అనిల్ కి హ్యాట్రిక్ సక్సెస్ లు అందించింది. ఇకపోతే దాని తరువాత విక్టరీ వెంకటేష్, యువ హీరో వరుణ్ తేజ్ ల కలయికలో తెరకెక్కిన ఎఫ్2 మూవీ తో మరొక సూపర్ హిట్ కొట్టిన అనిల్, ఆపై సూపర్ స్టార్ మహేష్ తో తీసిన బ్లాక్ బస్టర్ మూవీ సరిలేరు నీకెవ్వరు తో ఇంకో విజయాన్ని అందుకుని కెరీర్ పరంగా అపజయమెరుగని దర్శకుడిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు.

ఇక అతి త్వరలో ఆయన తెరకెక్కించనున్న సినిమా ఎఫ్3. గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఎఫ్2కి సీక్వెల్ గా మరింత ఎంటర్టైన్మెంట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెంకీ, వరుణ్ తో పాటు మరొక స్టార్ హీరో కూడా ఒక కీలక పాత్ర చేయనున్నట్లుగా కొద్దిరోజుల నుండి పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. అయితే లేటెస్ట్ గా కొన్ని ఫిలింనగర్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి, ఈ సినిమాలో ఆ స్టార్ హీరో నటించడం లేదని, ఇటీవల కథలో కొద్దిపాటి మార్పులు చేసిన అనిల్ ఆ పాత్ర స్థానంలో మరొక పాత్రని సృష్టించారని, ఆ రోల్ లో ఒక ప్రముఖ సీనియర్ నటుడు నటించనున్నారని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన రావాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: