యువ హీరో నాగ శౌర్య ప్రస్తుతం సంతోష్ జాగర్లమూడి డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. పిరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా కోసం నాగ శౌర్య సిక్స్ ప్యాక్ ట్రై చేశాడు. అశ్వద్ధామ తర్వాత నాగ శౌర్య చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. నాగ శౌర్య 20వ సినిమాగా వస్తున్న ఈ మూవీకి టైటిల్ విషయంలో క్లారిటీ వచ్చింది.

ఈ సినిమాకు అంతకుముందు ధనుర్దారి అని పెట్టాలని అనుకున్నారు కాని అది ఎందుకో వద్దనుకుని పార్ధు టైటిల్ కు ఫిక్స్ అయ్యారు. అయితే ఈ టైటిల్ ఆల్రెడీ త్రివిక్రం రిజిస్టర్ చేశారని తెలియడంతో ఫైనల్ గా నాగ శౌర్య సినిమకు లక్ష్య అని టైటిల్ ఫిక్స్ చేశారట. గోపీచంద్, జగపతి బాబు కలిసి నటించిన సినిమాకు లక్ష్యం అని పెట్టారు.

ఇక ఇప్పుడు నాగ శౌర్య సినిమాకు లక్ష్య అని ఫిక్స్ చేశారట. ఈ సినిమాలో నాగ శౌర్య సరసన కెతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఆకాష్ పూరీ రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న కెతిక శర్మకు ఆ సినిమా రిలీజ్ అవకముందే ఈ సినిమా ఛాన్స్ వచ్చింది. నాగ శౌర్య సినిమాలో ఛాన్స్ అంటే యూత్ ఆడియెన్స్ కు దగ్గరయ్యే ఛాన్స్ ఉంది. ఛలోతో రష్మిక మందన్న ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా మారింది. కాబట్టి నాగ శర్య సరసన జోడీ కట్టి స్టార్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి.                                                                        
 

మరింత సమాచారం తెలుసుకోండి: