జబర్దస్త్ యాంకర్ అనసూయ తన కొత్త సినిమా అప్డేట్ తో ఆడియెన్స్ కు షాక్ ఇచ్చింది. థ్యాంక్ యు బ్రదర్ అంటూ పోస్టర్ తో సర్ ప్రైజ్ చేసింది అనసూయ. సినిమాలో ఆమె బేబీ బంప్ తో కనిపించి అందరికి షాక్ ఇచ్చింది. రమేష్ రాపర్తి డైరక్షన్ లో వస్తున్న థ్యాంక్ యు బ్రదర్ సినిమా కథ తనకు బాగా కనెక్ట్ అయ్యిందని అందుకే ఈ సినిమాను చేశానని అన్నది అనసూయ. తను ఇలాంటి పాత్ర చేయడం ఏంటని అందరు అంటున్నారు.. ఇద్దరి బిడ్డలకు తల్లిగా తనకు ఈ సినిమా కథ బాగా నచ్చిందని అన్నారు అనసూయ.

ఇలాంటి పాత్ర చేయడంలో తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని అంటుంది అనసూయ. సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా మళ్లీ తను గర్భవతిని కావడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నట్టు చెప్పుకొచ్చారు అనసూయ. అనసూయ, భర్ధ్వాజ్ లకు ఇద్దరు మగ బిడ్డలు ఉన్నారు. అయితే ఈ సినిమా కోసం ఆ అనుభవం బాగా ఉపయోగపడ్డదని అన్నారు అనసూయ.

మూడో బిడ్డకు జన్మనిచ్చేందుకు రెడీ అంటూ తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసింది అనసూయ. జబర్దస్త్ బ్యూటీగా స్మాల్ స్క్రీన్ పై తన హాట్ హాట్ అందాలతో అలరించే అనసూయ సినిమాల్లో మాత్రం కొత్త కథలతో వస్తుంది. క్షణం, రంగస్థలం సినిమాలే అందుకు ఉదహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాలో కూడా అనసూయ మంచి పాత్ర చేస్తుందని తెలుస్తుంది. జబర్దస్త్ యాంకర్ గా అనసూయ మరో ఐదారేళ్లు ఈజీగా తన ఫాం కొనసాగించేలా ఉంది.                                                       

మరింత సమాచారం తెలుసుకోండి: