టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి మొదలుకొని ప్రస్తుతం ఉప్పెన సినిమా చేస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ వరకు మెగా ఫ్యామిలీ లోని హీరోల్లో చాలా మంది కెరీర్ పరంగా మంచి సక్సెస్ లు అందుకున్న వారే. ఇక చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ వంటి వారు కెరీర్ పరంగా మరింత వేగవంతంగా దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. అయితే మెగా ఫ్యామిలీలో దాదాపుగా బడా హీరోలు అందరికీ తెలుగు సహా పలు ఇతర భాషల్లో కూడా మంచి క్రేజ్ ఉంది. అలానే ఆయా భాషల్లో వారికి అభిమానులు కూడా ఉన్నారు.
ఇక ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, మొదటి నుండి కూడా శాండల్ వుడ్, అదేనండి కన్నడ చిత్ర పరిశ్రమలో మెగా హీరోల హవా ఎక్కువగా ఉండేది. టాలీవుడ్ మెగా హీరోల సినిమాలు అక్కడ డబ్ చేయబడి మంచి కలెక్షన్ ని ఆర్జించడంతో పాటు టెలివిజన్ లో వారి సినిమాలు ప్రదర్శితం అయితే భారీగా రేటింగ్స్ ని దక్కించుకుంటాయి. అయితే ఇక లేటెస్ట్ గా కొందరు సినీ విశ్లేషకులు వెల్లడిస్తున్న వివరాలను బట్టి ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక మందన్న ల కలయికలో యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమా కొద్దిరోజుల క్రితం కన్నడ టివి ఛానల్స్ లో ప్రదర్శితం అయి ఇప్పటివరకు తెలుగు డబ్బింగ్ సినిమాలకు అక్కడ దక్కిన రేటింగ్స్ అన్నిటినీ తలదన్ని టాప్ స్థాయిలో భారీ రేటింగ్స్ ని దక్కించుకున్నట్లు చెప్తున్నారు.

ఇక సూపర్ స్టార్ కి కూడా అక్కడ మొదటి నుండి మంచి పేరుందని, అయితే అది సరిలేరు నీకెవ్వరు మూవీ తో మరింతగా పెరిగిందని, ఈ విధంగా మెగాకంచు కోట అయిన కన్నడ లో సూపర్ స్టార్ మహేష్ జండా పాతారని వారు అంటున్నారు. ఇక అతి త్వరలో సూపర్ స్టార్ మహేష్ నటించనున్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట కూడా తెలుగు సహా పలు ఇతర భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది....!!



మరింత సమాచారం తెలుసుకోండి: