ఇక రాజకీయాల్లోకి వెళ్ళిపోయాను ఇక సినిమాలు చేయనని చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ మరల వరుస సినిమాలు చేసి వాళ్లని ఖుషీ చేశాడు. ఇప్పటికే ఆయన వకీల్ సాబ్ అనే సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమా కాక మరో నాలుగు సినిమాలకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాదాపు ఈ నాలుగు సినిమాలు పూర్తి కావాలంటే మరో రెండున్నర నుంచి మూడు ఏళ్లు పట్టడం ఖాయం. అయినా ఈ నీ వెంట పడే వాళ్ళ లిస్ట్ మాత్రం తగ్గడం లేదు. అయితే తాజాగా ఒక గాసిప్ ఇండస్ట్రీ వర్గాల్లో విపరీతంగా తిరుగుతుంది.

దాని ప్రకారం ఆయన మరో సినిమా ఒప్పుకున్నాడట. ఇండస్ట్రీలో ఇప్పుడు లీడింగ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ కోసం ఒక కథ సిద్ధం చేసి దానిని పవన్ కళ్యాణ్ కి వినిపించాడట. ఈ కథ నచ్చడంతో పవన్ కళ్యాణ్ కూడా నీతో సినిమా చేస్తాను అని జానీ మాస్టర్ కి మాట ఇచ్చినట్లు చెబుతున్నారు. అయితే కథలో చిన్న చిన్న మార్పులు చేయాల్సి ఉందని ఆ మార్పులు సూచించారని తెలుస్తోంది. ఈ మార్పులన్నీ పూర్తి చేసిన పిమ్మట నీతో సినిమా తప్పక చేస్తానని పవన్ మాట ఇచ్చినట్లు. ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

 ఈ విషయంలో నిజానిజాలు ఎంత అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం పవన్ ప్రస్తుతం నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు, అలానే ఈ సినిమా ఒరిజినల్ మేకరయినా బోనీకపూర్ ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమాకి రీమేక్ అనే సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: