బిగ్ బాస్ సీజన్ 4లో సూపర్ సెవన్ ప్రస్తుతం హౌజ్ లో ఉన్నారు. 12వ వారం కెప్టెన్సీ, నామినేషన్ ఉన్నాయి.. కాని 13వ వారంలో నో కెప్టెన్సీ.. వచ్చే వారం అందరు నామినేట్ అవుతారు. ఉన్న ఏడుగురిలో ఏడుగురిని నామినేట్ చేయాలని ప్లాన్. అయితే రేపు కలర్ వాటర్ ఇచ్చి బౌల్స్ లో ఎవరిని నామినేట్ చేస్తారో వారి బౌల్ లో ఆ కలర్ వాటర్ నింపాల్సి ఉంటుంది. దాదాపు అందరు నామినేట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయని తెలుస్తుంది.

అయితే నామినేషన్స్ లో ఏడుగురు ఉంటే.. ఒకరి ఫ్యాన్స్ మరొకరికి ఓటు వేసే ఛాన్స్ లేదు. తమ ఒక్కరి ఓటు కూడా వేస్ట్ కాకూడదని అందరు తాము సపోర్ట్ చేసే హౌజ్ మేట్ కు ఓటు వేస్తారు. ప్రస్తుతం హౌజ్ లో అభిజిత్, అరియానా, అఖిల్, అవినాష్, మోనాల్, హారిక, సోహెల్ ఉన్నారు. వీరిలో నెక్స్ట్ వీక్ అందరు నామినేట్ అయితే మాత్రం ఎవరి బలం ఎంతా అని తేల్చుకునేలా టఫ్ ఫైట్ జరుగుతుంది. తప్పకుండా నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది.

ప్రస్తుతం ఉన్న కాలిక్యులేషన్స్ ప్రకారం హౌజ్ లో ఉన్న ఏడుగురిలో ఇద్దరిని ఎలిమినేట్ చేసి ఫైనల్ వీక్ లో టాప్ 5 ని ఉంచుతారు. వారిలో టాప్ 3ని.. ఆ తర్వాత టాప్ 2.. ఆ నెక్స్ట్ విజేతని ప్రకటిస్తారు. డిసెంబర్ 20న ఈ బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ ఎపిసోడ్ వస్తుందని తెలుస్తుంది.                                                                               

మరింత సమాచారం తెలుసుకోండి: