రాజకీయాల్లోకి వెళ్లి అక్కడ రాణించలేక మళ్ళీ తిరిగి వచ్చి సినిమాల మీద దృష్టి పెట్టాడు చిరంజీవి. వచ్చీ రావడం తోటి ఖైదీ నెంబర్ 150 లాంటి సినిమా చేసి తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు. ఆ సినిమా తరువాత తన చిరకాల డ్రీమ్ రోల్ అయిన సైరా నరసింహారెడ్డి అనే సినిమాలో నరసింహారెడ్డి పాత్ర చేసి హిట్ అందుకున్నాడు. బాహుబలి రేంజ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా అనుకున్న అంచనాలను అందుకోలేకపోయింది. కానీ హిట్ అయింది. ప్రస్తుతం ఆయన కొరటాల దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు.  ఈ సినిమా దేవాదాయ భూముల కు సంబంధించిన సినిమా అని ముందు నుంచి ఈ సినిమా గురించి ప్రచారం ఉంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.

 అయితే ఈ సినిమా విషయంలో పక్కనపెడితే చిరంజీవిసినిమా తరువాత మరో రెండు సినిమాలు చేశాడు. ఆ రెండు సినిమాలు రీమెక్స్ కావడం గమనార్హం అందులో ఒక సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ అనే సినిమాకి రీమేక్. అక్కడ మోహన్ లాల్ నటించిన సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఇక్కడ రీమేక్ చేస్తున్నాడు చిరంజీవి. ఇది కాకుండా తమిళంలో సూపర్ హిట్ అయినా వేదాళం అనే సినిమాను కూడా తెలుగులో తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు సినిమాలు కాకుండా బాబీ దర్శకత్వంలో మరో సినిమా కూడా చేస్తున్నాడు చిరంజీవి.

 ఈ బాబీ దర్శకత్వంలో చేసే సినిమాకు కథ చిరంజీవికి నచ్చలేదట. కథగా చెప్పినప్పుడు బానే ఉంది కానీ దాన్ని డెవలప్ చేస్తే అంతగా నచ్చలేదు అని బాబీ ముఖం మీదనే చెప్పేశాడట చిరంజీవి. లూసిఫర్ రీమేక్ విషయంలో కూడా ముందు సుజిత్ చిరంజీవిని మెప్పించలేక పోగా ఆయన పక్కన పెట్టేశారు. ఆ తర్వాత రంగంలోకి దిగిన వివి వినాయక్ కూడా చిరంజీవిని మెప్పించ లేక పోవడంతో ఆయన్ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు మరో దర్శకుడు కోసం వేటలో పడ్డారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు బాబీని కూడా తపించడmo  లేక సినిమాని పూర్తిగా ఆపివేయడమో చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో చిరంజీవి రిస్కు చేసేలా కనపడటం లేదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: