తమిళ హీరో విజయ్ ప్రస్తుతం మాస్టర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. లోకేష్ కనకరాజన్ దర్శకుడు.కార్తి ఖైదితో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ అన్ని పనులు పూర్తి చేసుకుని విడుదల కి సిద్ధంగా ఉంది.. లాక్ డౌన్ ముందుగానే ఈ సినిమా రిలీజ్ కి రెడీ గా ఉండగా ఈ సినిమా రిలీజ్ ని అడ్డుకుంది కరోనా... దాంతో విజయ్ ఫాన్స్ నిరుత్సాహపడ్డాడు.. ఎన్నో అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ని OTT లో రిలీజ్ చేస్తారని చూసిన ధియేటర్ రిలీజ్ కే నిర్మాతలు మొగ్గు చూపారు.

 ఈ నేపథ్యంలో మాస్టర్ కు సంబంధించిన ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది.తమిళనాడు ప్రభుత్వం ఇప్పట్లో యాభయ్ శాతం సీటింగ్ ఆక్యుపెన్సీ నిబంధనను సడలించే ఆలోచనలో లేదట. అంతే కాదు తెల్లవారుఝామున బెనిఫిట్ షోలను ఆరు నెలల పాటు నిషేధించే ప్రతిపాదన ఉన్నట్టు చెన్నై టాక్. ఇవే జరిగితే విజయ్ రేంజ్ స్టార్ కు ఓపెనింగ్స్ పరంగా తీవ్ర ప్రభావం ఉంటుంది. అభిమానులు ఎంత అండగా నిలబడినా మహా అయితే రెండు మూడు రోజులు లేదా వారం అది హెల్ప్ అవుతుంది. తర్వాత చూడాల్సింది సాధారణ ప్రేక్షకులే.

అందుకే మాస్టర్ సినిమా కి మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో OTT కి ఇచ్చేయడమే బెటర్ అనే ఆలోచనకు వస్తున్నారట.. ఇప్పటికే పెద్ద పెద్ద OTT సంస్థలు వందకోట్లకు పైగా ఈ సినిమా ని కొనుగోలు చేయాలనీ చూస్తున్నారు.. ఈ నేపథ్యంలో  నెట్ ఫ్లిక్స్  సంస్థకు ఈ సినిమా అమ్మేయాలని నిర్మాతలు యోచిస్తున్నారు.. ఇదే నిజమైతే ఇండియన్ హిస్టరీ లో ఎక్కువ రేటు కు కొన్న మొదటి సినిమా అవుద్ది.. ఇక ఈ సినిమా తర్వాత దర్శకుడు లోకేష్ కమల్ హాసన్ తో విక్రమ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. 

మరింత సమాచారం తెలుసుకోండి: