వెంకటేష్ వరుణ్ తేజ్ లు నటించిన f2 సినిమా టాలీవుడ్ లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. మాస్ సినిమాలు చూసి చూసి విసుగొచ్చిన ప్రేక్షకులకు ఈ సినిమా ఎంతో రిఫ్రెష్ ఇచ్చింది.. కమర్షియల్ సినిమాల్లో కామెడీ ని జోడించి హిట్ సినిమాలు  చేయడం ఒక్క అనిల్ రావిపూడి కే చెల్లింది..అయన సినిమాలు అన్నీ దాదాపు ఇదే ఫార్ములా ని పోలి ఉంటాయి.  ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన పటాస్ సినిమా హిట్ రావడంతోనే టాలీవుడ్ కి ఓ మేలిమి డైరెక్టర్ దొరికిపోయాడని అర్థమైపోయింది.. తొలి సినిమా తోనే హిట్ కొట్టిన అనిల్ ఆ తర్వాత వరుసగా మూడు హిట్ లు కొట్టి టాప్ డైరెక్టర్ గా సెటిల్ అయిపోయాడు..

అయన దర్శకత్వంలో ప్రస్తుతం f2 సీక్వెల్ f3 సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల రెండో వారం నుంచి షూటింగ్ ప్లాన్ చేసుకున్న ఎఫ్3 సినిమా f2 తగ్గట్లే ఓ రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది.. ఈ సినిమా లో అన్ని సీన్స్ హిలేరియస్ గా నవ్విస్తాయని అంటున్నారు.. ఇందులో మరో హీరో కూడా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.. రవితేజహీరో అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.. అయితే అన్ని ఏర్పాట్లు చేసుకున్న ఈ సినిమా కి ఇప్పుడు వరుణ్ తేజ్ కొంత ఇబ్బంది గా మారాడని తెలుస్తుంది..

వరుణ్ తేజ్ నుంచి స్టోరీ ప్లస్ రెమ్యునరేషన్ పరంగా వస్తున్న డిమాండ్ వల్ల కొంత ఇబ్బందులు ఉన్నాయని వినికిడి. f2 సినిమా చేసే టైం కి వరుణ్ తేజ్ పెద్దగా ఇమేజ్ లేదు. ఇప్పుడు ఓ రేంజ్ హీరో అనిపించుకుంటున్నాడు.. దాంతో వెంకటేష్ తో సమానంగా తనకూ పన్నెండు కోట్ల దాకా పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడట. అంతేకాక  ఈ సీక్వెల్ లో తన క్యారెక్టర్ కు కొంత వెయిట్ పెంచాలని డిమాండ్ చేస్తున్నాడట.. ఇందులో ఎంత వరకు నిజముందో తెలియదు కానీ మొత్తానికి నిర్మాత దిల్ రాజు ఈ విషయాన్ని సెటిల్ చేయడానికి గట్టిగా ట్రై చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ అయిపోయింది. క్యాస్టింగ్ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ చేశారు. ఇప్పుడు వరుణ్ తేజ్ ని ఎలా ఒప్పిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: