తెలుగులో డిఫరెంట్ సినిమాలు చేసే హీరోలలో మంచు మనోజ్ ఒకరు. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ సాదించిన ఆయన కెరియర్ లో లేవు.గత సినిమాలన్నీ కూడా ఘోరంగా పరాజయం పాలయ్యాయి.దీంతో ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పినట్టు అటు సంవత్సరంలో ట్వీట్ చేసి అందరినీ ఒక్కసారిగా షాక్ కు గురిచేశాడు.

అయితే అయన అహం బ్రహ్మాస్మి అనే సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు.లక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా మళ్ళీ యాక్టివ్ కాయబోతున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమాలో ఒక గెస్ట్ రోల్ ఉందని.. క్లైమాక్స్ లో వచ్చే ఆ రోల్ లో ఓ స్టార్ హీరో నిముషం పాటు కనిపించనున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. మరి మనోజ్ కోసం నటిస్తున్న ఆ స్టార్ హీరో ఎవరు అనేది చూడాలి. సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది.

 ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ లో ఫైట్ మాస్టర్ పీటర్ హేన్స్ కంపోజింగ్ లో భారీ ఫైట్ సీక్వెన్సెస్ ను పూర్తి చేశారు. ఆ ఫైట్ సీక్వెన్స్ చాలా బాగా వచ్చిందని తెలుస్తోంది.ఇక ఎప్పుడూ కొత్తదనం కోసం వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తాడు మనోజ్. ఈ సారి కూడా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో.. ‘అహం బ్రహ్మాస్మి’ అనే గొప్ప స్లోగన్ ఆధారంగా నడిచే కథతో పవర్ ఫుల్ రీఎంట్రీ ఇస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: