సూపర్ స్టార్ మహేష్ తన లుక్స్ లో చాల అందంగా ఇప్పటికీ చాల యంగ్ గా కనిపిస్తూ ఉంటాడు. అయితే మహేష్ సినిమా కెరియర్ మొదలై అప్పుడే 41 సంవత్సరాలు పూర్తి అయ్యాయి అంటే ఎవరైనా ఆశ్చర్యపడే విషయం. ఇప్పటి వరకు మహేష్ హీరోగా నటించిన సినిమాలు కేవలం 26 మాత్రమే అయినా ఫిలిం ఇండస్ట్రీతో మహేష్ తన బాంధవ్యాన్ని 41 సంవత్సరాలుగా కొనసాగిస్తూనే ఉన్నాడు.


ఈసందర్భంగా మహేష్ బాబు అభిమానులు నిన్నటి నుండి సోషల్ మీడియాలో చేస్తున్న సందడి ఆకాశాన్ని అంటుతోంది. మహేష్ ఫిలిం ఇండస్ట్రీ కెరియర్ 41 సంవత్సరాలు పూర్తయినట్లు రూపొందించిన సీడీపీ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సీడీపీ లో ఒక పెద్ద భవనాన్ని దాని పక్కన  మహేష్ మైనపు బొమ్మను చూపెడుతూ అందర్నీ ఆకర్షించే విధంగా ఈ వెబ్ పోష్టర్ ను డిజైన్ చేసారు.  


దర్శకరత్న దాసరి నారాయణరావు డైరెక్షన్ లో 1979లో ‘నీడ’ అనే సినిమా విడుదలైంది. ఈ సినిమాలో మహేష్ బాబు బాలనటుడిగా పరిచయం అయ్యాడు. ఒక చిన్న సినిమాగా విడుదలైన ఆ మూవీ అప్పట్లో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా విడుదలై ఈ ఏడాదితో 41 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా మహేష్ అభిమానులు ఈ హడావిడి చేస్తున్నారు.


ఎన్టీఆర్ ఏఎన్నార్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ మాత్రమే  సినీ ఇండస్ట్రీకి వచ్చి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రికార్డును సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఈ రికార్డులలోకి మహేష్ ఎంటర్ కావడం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది. మహేష్ తను నటించిన మొదటి సినిమా ‘రాజకుమారుడు’ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి ఇప్పటికీ తన ఇమేజ్ ను చెక్కు చెదరనీయకుండ కాపాడుకుంటున్నాడు. సాధారణంగా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఫిలిం ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చినవారు ఆతరువాత హీరోలుగా రాణించిన సందర్భాలు చాల అరుదు. అయితే ఆ సెంటిమెంట్ ను కూడ బ్రేక్ చేసి మహేష్ సూపర్ స్టార్ గా కొనసాగుతూ తన ఫిలిం ఇండస్ట్రీ కెరియర్ ను మరో 10 సంవత్సరాలు కొనసాగించగలిగితే అక్కినేని ఎన్టీఆర్ లులా ఇండస్ట్రీలో 50 కెరియర్ ను పూర్తిచేసుకున్న హీరోగా మారే ఆస్కారం ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: