బిగ్ బాస్ చివరి ఘట్టానికి చేరుకుంది..పన్నెండు వారాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో లో  గత వారం ఎలిమినేషన్ లేదు.. అయితే ఎప్పటిలాగే ప్రతి వారం నామినేషన్ లో మోనాల్ , అఖిల్, అరియనా,అవినాష్ లు నామినేషన్ లో ఉన్నారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు అనే వార్తలు వారం మొత్తంలో వినపడ్డాయి. కానీ చివరికి బిగ్ బాస్ అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు.. ఈ మేరకు ప్రముఖ హీరో సుదీప్ ను కూడా తీసుకొచ్చారు. దాంతో నిన్నటి ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది.



ఎక్కువ మంది అవినాష్ ఎలిమినేట్ అవుతాడంటూ ఓట్లు వేశారు. ‘బిగ్ బాస్‌ 4లో 12వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని భావిస్తున్నారు?’ అంటే.. 28 శాతం మంది అవినాష్ ఎలిమినేట్ అవుతాడనే అభిప్రాయాన్ని వ్యక్తిపరిచారు. ఆ తరువాత 25 శాతం మంది మోనాల్ ఎలిమినేట్ అవుతుందని చెప్పారు. ఇక అఖిల్ 23 శాతం మంది ఎలిమినేట్ అవుతారని పోలింగ్ లో తేలింది.



మోనాల్, అఖిల్, అరియానాలలో మోనాల్‌కి అభిజిత్ ఫ్యాన్స్ ఓట్లు గట్టిగా పడటంతో ఆమె టాప్ ప్లేస్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. నామినేషన్స్‌లో అభిజిత్‌కి బదులుగా మోనాల్ స్వాప్ చేసింది హారిక.. దీంతో అభిజిత్ ఫ్యాన్స్‌తో పాటు హారిక ఫ్యాన్స్ కూడా మోనాల్‌కి మద్దతుగా నిలిచారు.మొత్తానికి అభిజిత్ ఫ్యాన్స్ మోనాల్ , హారికకు సపోర్ట్ ఇచ్చారు. దీంతో మనోడు పులిహోర కలపడం మళ్లీ మొదలు పెట్టారు.  12 వారాల నామినేషన్స్, ఎలిమినేషన్స్ వాటి రిజల్ట్‌ని బట్టి చూస్తే ఓట్లు వేసినా వేయకపోయినా మోనాల్ ఎలిమినేషన్ అనేది ప్రేక్షకుల చేతులో లేదని ఇప్పటికే తేలిపోయింది. గతం లో స్ట్రాంగ్ ఉన్న వాళ్ళనే బిగ్ బాస్ ఎలిమినేట్ చేశారు. మరి మోనాల్ ను ఎందుకు ప్రతిసారీ సేవ్ చేస్తున్నాడని తెలియడం లేదు..మరి ఈ వారం అన్నా ఎలిమినేషన్ ఉందో లేదో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: