టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు ఇప్పుడు అన్ని ఇండ్రస్టీలకు చెందిన సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా 'RRR'.బాహుబలి లాంటి అత్యద్భుతమైన విజయం తర్వాత మన రాజమౌళి తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి పరిచయం చేసారు. అక్కడితో రాజమౌళి తీసే ప్రస్తుత సినిమాలపై అందరూ దృష్టి సారించారు. ఇక తాజాగా మన జక్కన్న.. టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'RRR' సినిమా దాదాపు పది భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన హీరోల ఇంట్రో టీజర్లు యూట్యూబ్ లో ఎన్నో సంచలనాలు సృష్టిస్తున్నాయి.

 ముఖ్యంగా ఈ మధ్య విడుదల అయిన ఎన్టీఆర్ కొమురం భీమ్ టీజర్ అయితే రికార్డుల మోత మోగిస్తోంది.వ్యూస్ పరంగా, కామెంట్స్, లైక్స్ పరంగా ఇలా ఏదో ఒక కొత్త రికార్డ్ తో నిత్యం వార్తల్లో నిలుస్తోంది రామరాజు ఫర్ భీమ్ టీజర్. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలై ఎంతో వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవలే హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లను చిత్రీకరించిన జక్కన్న..  ప్రస్తుతం కొత్త షెడ్యూల్ ని మొదలు పెట్టి పుణెలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త బయటికొచ్చింది. ఇందులో భారీ పోరాట సన్నివేశాలున్నాయట. అటవీ ప్రాంతంలో 300 మంది ఆదివాసులు, 100 మంది పోలీసుల మధ్య ఎన్టీఆర్‌పై భారీ యాక్షన్‌ సీన్‌ చిత్రీకరించారట రాజమౌళి.

 ఆ పోరాట సన్నివేశాలు దాదాపు 20 నిమిషాల నిడివితో ఉంటాయని సమాచారం. ఆ సందర్భంలోనే తొలిసారి అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ కలుస్తారనీ, అక్కడి నుంచే ఇద్దరూ ఒక్కటై పోరాటం కొనసాగిస్తారని తెలిసింది. అయితే 25 నిమిషాల నిడివితో చిత్రీకరించిన పోరాట సన్నివేశాలు సినిమాలో ఓ రేంజ్ లో హైలైట్ అవ్వనున్నాయని..రేపు సినిమా విడుదలయ్యాక థియేటర్లలో ఈ సీన్స్ మెగా, నందమూరి ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిచడం ఖాయమని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మరి ఇదే కనుక నిజమైతే ఎప్పటినుంచో సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానుల ఆకలి తీరినట్లేనని అంటున్నారు సినీ విశ్లేషకులు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: