టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య' .హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  ఈ సినిమాను చరణ్, నిరంజన్ రెడ్డిలు కలిసి కొణిదెల ప్రోడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇక అది అలా ఉంటే ఆచార్య షూటింగ్‌లో ఉండగానే చిరంజీవి మరో సినిమాకు ఓకే చెప్పారు. ఓ మలయాళ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు చిరు. మలయాళంలో క్రితం ఏడాది వచ్చిన 'లూసిఫర్' సంచలన విజయాన్ని నమోదు చేసింది. మోహన్ లాల్ నటించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ అక్కడ మంచి విజయం సాధించి ఆయన కెరీర్‌లోని ఓ చెప్పుకోదగ్గ చిత్రంగా నిలిచింది. దాంతో ఈ సినిమాను చిరంజీవితో తెలుగులో రీమేక్ చేయాలనే ఉద్దేశంతో ఆ సినిమా తెలుగు రీమేక్ హక్కులను చరణ్ సొంతం చేసుకున్నాడు.

ఇక అప్పటి నుంచి ఈ రీమేక్ దర్శకత్వ బాధ్యతలను ఎవరికి అప్పగించనున్నారనే ఆసక్తి మెగా అభిమానుల్లో మొదలైంది.చిరు ఈ క్రేజీ ప్రాజెక్టును అనుభవం ఉన్న డైరెక్టర్ వినాయక్‌తో చేయాలనీ నిర్ణయానికి వచ్చాడని వార్తలు రాగా.. తాజాగా వస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమాను మరోదర్శకుడు మోహన్ రాజాకు అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఇప్పట్లో మొదలయ్యేలా కనిపించడం లేదు. స్క్రిప్ట్ విషయంలో మెగాస్టార్ సంతృప్తి చెందలేదని.. అందుకే మెహర్ రమేష్ సినిమాని లైన్ లో ముందుకు తీసుకువచ్చారని.. దాంతో 'లూసిఫర్' మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్ కి తగ్గట్టుగా లూసిఫెర్ స్క్రిప్ట్‌ లో మార్పులు చేయనున్నారట.

 ఇక 'లూసిఫర్'లో మంజు వారియర్ హీరోకి చెల్లి పాత్రలో నటించింది. తెలుగులో ఈ పాత్రలో సుహాసిని కనిపించబోతుందట. కాగా ఈ సినిమాలో హీరోయిజమ్ ఎలివేషన్స్ ఉన్న సీన్స్ మెయిన్ హైలైట్ గా ఉండేలా.. మెగా అభిమానులకు ఫుల్ జోష్ ని ఇచ్చేలా సినిమాని తెరకెక్కించాలని చూస్తున్నారట దర్శకనిర్మా తలు. మోహన్ రాజా గతంలో చాలా రీమేక్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. తెలుగులో హనుమాన్ జంక్షన్‌ను డైరెక్ట్ చేసింది ఇతడే. ఆ తర్వాత తమిళ్ లో చాలా సినిమాలకు దర్శకత్వం వహించాడు. .మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత మెగాస్టార్ తో సినిమా తీసే ఛాన్స్ దక్కించుకున్నాడు ఈ దర్శకుడు. మరి మలయాళ రీమేక్ తో మన తెలుగులో హిట్ కొడతాడేమో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: