బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో ఇపుడు కధ క్లైమాక్స్ కి చేరింది. విన్నర్ ఎవరో తెలడానికి కచ్చితంగా ఇరవై రోజుల టైం ఉంది. కానీ టాప్ ఫైవ్ ఎవరో మాత్రం తెలిసిపోతోంది. మొత్తం ఏడుగురు ఇపుడు హౌస్ లో ఉన్నారు. వీరిలో ఇద్దరు వచ్చే రెండు వారాల్లో హౌస్ నుంచి బయటకు వస్తారు. అలా వచ్చే ఆ ఇద్దరూ ఎవరా అన్నది అందరిలో చర్చగా ఉంది.

ఆడియన్స్ నుంచి చూసుకుంటే టాప్ ఫైవ్ గా అభిజిత్, అఖిల్. సోహెల్, మోనాల్, హారిక ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 12వ‌ వారం ఎలిమినేషన్ రౌండ్ లో చూసుకున్నపుడు ఆరియానా, అవినాష్ మాత్రమే డేంజర్ జోన్ లో ఉండి చివరి వరకూ పోటీ పడ్డారు. అవినాష్ మీద ఓట్ల ఆధిక్యత ఆరియానా సాధించినా టాప్ ఫైవ్ లో ప్లేస్ లోకి మాత్రం వెళ్లలేకపోతోంది.

టాప్ ఫైవ్ లో ఇప్పటికే బలమైన కంటెస్టెంట్లు ఉన్నారు. అందరి అంచనాలు తల్లకిందులు చేస్తూ మోనాల్ గజ్జల్ తన గ్రాఫ్ ని ఒక్కసారి గా పెంచుకుని టాప్ ఫైవ్ లోకి వచ్చేయడంతో ఇపుడు ఆరియాన మెడ మీద ఎలిమినేషన్ కత్తి వేలాడుతోంది.

డిసెంబర్ 6న జరిగే వీకెండ్ లో అవినాష్ ఎలిమినేట్ అయితే డిసెంబర్ 13న జరిగిన మరో ఎలిమినేషన్ లో ఆరియానా ఎలిమినేట్ అవుతుందని ఇప్పటి వారి ఓట్లు, పొజిషన్ చూస్తే అర్ధమవుతుంది. బిగ్ బాస్ ఎటువటి ట్విస్టులు పెట్టకుండా ఉంటే మాత్రం ఇదే ఖాయమని అంటున్నారు. అయితే టాప్ ఫైవ్ లో ఆరియానా ఉంటుందని అంతా అనుకున్నారు కానీ మోనాల్ గజ్జర్ రావడం మాత్రం బిగ్ ట్విస్ట్ గానే చెప్పుకోవాలి. మిగిలింది రెండు వారాలే కాబట్టి టాస్కులలో ఎంత టాలెంట్ చూపించినా కూడా ఈ ప్లేస్ లలో మార్పు పెద్దగా ఉండదని కూడా అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. టాప్ ఫైవ్ కోసం హోరా హోరీ ఫైట్ అయితే ఖాయం.



మరింత సమాచారం తెలుసుకోండి: