అక్కినేని అమల...ఈమె గురించి తెలియని తెలుగు వారు ఉండరు. సినిమా ఇండస్ట్రీ లో అడుగుపెట్టి, నాగార్జున తో ప్రేమలో పడి పెళ్లి చేసుకొని అక్కినేని కోడలిగా చక్కగా, సమర్ధవంతంగా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. హలో గురు ప్రేమ కోసమే జీవితం అంటూ సాగే పాట ఇప్పటికి తెలుగు అభిమానులకు గుర్తుంది అంటే ఆ క్రెడిట్ అమలకు ఖచ్చితంగా దక్కుతుంది. అక్కినేని ఫ్యామిలీ మెంబర్ గానే కాదు బ్లూ క్రాస్ వంటి జంతు సేవ కార్యక్రమాలతో ఆమె కు ఎంతో మంచి పేరు వచ్చింది. ఇక పెళ్లయ్యాక అమల సినిమా జీవితం పూర్తిగా వదిలేసారు.

1986వ సంవత్సరంలో మిథిలి ఎన్నై కాథలి అనే సినిమాతో తమిళ్ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది అమల. ఈ చిత్రానికి టి. రాజేందర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో ఓవర్ నైట్ ఫేమస్ అయిపోయింది అమల. ఆ తర్వాత వివిధ భాషల్లో యాభై కి పైగా సినిమాల్లో హీరోయిన్  గా నటించింది. ఉల్లాడక్కం అనే మలయాళ చిత్రం ద్వారా అమలకు ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు వరించింది. ఆమె నటించిన చిత్రాల్లో ఎక్కువగా తమిళ్ మూవీస్ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఇక అమల తన భర్త నాగార్జున తో కలిసి నిర్ణయం, శివ వంటి హిట్ సినిమాల్లో నటించింది.

సినిమా సెట్స్ పై ప్రేమ

నాగార్జునతో కలిసి నటిస్తున్న సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు. కానీ నాగార్జునకు అప్పటికే హీరో వెంకటేష్ అక్క  అయినా లక్ష్మి తో వివాహం జరిగింది. ఇద్దరి పెళ్లి కి సాక్ష్యంగా నాగ చైతన్య జన్మించాడు. అమల ఎంట్రీ తో ఇద్దరి మధ్య అనేక గొడవలు రావడంతో విడాకులు తీసుకొని అమలను పెళ్లి చేసుకున్నాడు. వీరికి హీరో అఖిల్ పుట్టాడు.  ఇక అమల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంతో రిఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఒకటి రెండు చిత్రాల్లో నటించిన పూర్తి స్థాయి సినిమాల్లో మాత్రం నటించడం లేదు.  ఇక అమల నాన్న బెంగాలీ నేవీ ఆఫీసర్ అయినా ముఖర్జీ కాగా తల్లి ఐర్లాండ్ దేశానికి చెందినవారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: