బిగ్ బాస్ సీజన్ 4 12వ వారం హైడ్రామా తర్వాత నామినేషన్స్ లో ఏడుగురు ఉన్నా ఎవరు ఎలిమినేట్ అవలేదు. మళ్లీ హౌజ్ లో సూపర్ సెవన్ ఉన్నారు. ఆదివారం ఎపిసోడ్ లో అవినాష్, అరియానాల మధ్య ఎలిమినేషన్ ఫైట్ జరుగగా.. అవినాష్ కు ఓట్లు తక్కువ వచ్చినా బిగ్ బాస్ ఇచ్చిన ఎవిక్షన్ పాస్ వల్ల అతను సేఫ్ అయ్యాడు. ఇక 13వ వారం ఎవరి సత్తా ఏంటన్నది తెలుస్తుంది.

ఇక 13వ వారం నామినేషన్స్ లో అరియానా సేఫ్ అయినట్టు తెలుస్తుంది. గత కొన్ని వారాలుగా అరియానా నామినేషన్స్ లో ఉంటూ వస్తుంది. కేవలం ఆమె కెప్టెన్ అయిన వారం తప్ప ఐదారు వారాలుగా నామినేట్ అవుతూ వస్తుంది. ఫైనల్ గా ఈ చివరి వారాల్లో అరియానా సేఫ్ అవడం షాకింగ్ గానే ఉంది. ఆమె ఆడుతున్న తీరు ప్రేక్షకులను మెప్పిస్తున్నా సరే హౌజ్ మేట్స్ ఆమెను టార్గెట్ చేస్తున్నారు. అయితే ఈ విషయం అర్ధమైన హౌజ్ మేట్స్ ఈ వారం ఆమెను నామినేట్ చేయకుండా వదిలేశారు.

అరియానా నామినేషన్స్ లో లేదు కాబట్టి ఆమె టాప్ 5లో పక్కా అన్నట్టే. అంతేకాదు హౌజ్ మేట్స్ అంతా ఆమెను వరస్ట్ కెప్టెన్ అన్నా సరే నాగార్జున బెస్ట్ కెప్టెన్ అన్నాడని బిగ్ బాస్ ఆమెకు ఓ స్పెషల్ ఆఫర్ కూడా ఇచ్చినట్టు టాక్. మరి మండే నామినేషన్స్ ఎలా ఉంటాయో చూడాలి. తప్పకుండా అరియానా తన కాలిక్యులేషన్స్ ప్రకారం ఆట ఆడుతుంది. 13వ వారం ఆమె సేఫ్ అయితే మాత్రం టాప్ 5 కాదు టాప్ 3లో ఆమె ఉండే ఛాన్స్ ఉంది.                                       

మరింత సమాచారం తెలుసుకోండి: