ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...సినిమాలో రొమాంటిక్ కిస్ సీన్స్ చాలా కామన్. పైగా ఈ రోజుల్లో రొమాంటిక్ సీన్లు ఎంత ఎక్కువగా సినిమాలలో ఉంటే అంత బాగా జనాలు ఆదరిస్తున్నారు. దీంతో కథతో పాటు హీరోయిన్ అందాల ఆరబోతకు ఎక్కువగా ఇంపార్టెన్స్  ఇస్తున్నారు దర్శకనిర్మాతలు. మరోవైపు హీరోయిన్లు కూడా కథ డిమాండ్ చేయాలే గానీ డబ్బులు ఇంకా గుర్తింపు కోసం రొమాంటిక్ సీన్స్ చేసేందుకు ఆలోచించకుండా  ఓకే  చెప్పేస్తున్నారు. ఈ క్రమంలోనే పోవే పోరా షో  యాంకర్ విష్ణుప్రియ తన తాజా సినిమా 'చెక్‌మేట్' గురించిన మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు చెబుతూ బోల్డ్ కామెంట్స్ చేసింది.

బులితెరపై పోవే పోరా షో ద్వారా  హాట్ యాంకర్‌గా యూత్ ని బాగా అట్ట్రాక్ట్ చేసి పాపులారిటీ  కూడగట్టుకున్న విష్ణుప్రియ ప్రస్తుతం 'చెక్‌మేట్' సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. చిన్ని కృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రసాద్ వెలంపల్లి దర్శక నిర్మాతగా తెరకెక్కించిన ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేసుకొని విడుదలకు సిద్ధమైంది. రాజేంద్రప్రసాద్, విష్ణుప్రియ సందీప్, దీక్షపంత్, బ్రహ్మనందం, రఘుబాబు షకలక శంకర్ కీలక పాత్రలు పోషించారు. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌లో విష్ణుప్రియ హాట్‌నెస్, రొమాంటిక్ కిస్ సీన్ల  డోస్ చూసి అంతా ఆశ్చర్యపోయారు.

కాగా తాజాగా 'చెక్‌మేట్' షూటింగ్ సంగతులపై ఈ విధంగా స్పందించింది విష్ణుప్రియ.. ఈ సినిమాలో తాను చాలా హాట్ రోల్ చేశానని, ఓ ఇరవై.. ముప్పై మంది చూస్తుండగానే హాట్ సీన్స్ చేశానని చెప్పుకొచ్చింది. ''హాస్టల్‌లో భగవద్గీత చదువుకునే 18 ఏళ్ల అమ్మాయినైన నేను.. సడెన్‌గా ఇలాంటి హాట్ రోల్ చేయడం కాస్త ఇబ్బందిగా అనిపించింది గానీ.. కథ డిమాండ్ మేరకు కొన్ని సీన్స్ చేశాను. హాట్ సీన్స్ చేయడం చాలా హార్డ్ కానీ మా డైరెక్టర్ దాన్ని కంఫర్టబుల్‌గా తెరకెక్కించారు. అయినా ఆ సీన్స్ చేసేది నేను కాదు సినిమాలోని క్యారెక్టర్. అందుకే నన్ను నేను మోటివేట్ చేసుకొని కెమెరా ముందు నటించా'' అని చెప్పింది విష్ణుప్రియ.ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: