ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...బిగ్ బాస్ సీజన్ 4 లో అఖిల్, మోనాల్ మధ్య వున్న రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం, ప్రేమ. కాని వాళ్ళ మనుసులో వాళ్ళ అభిప్రాయమేంటో తెలీదు గాని వాళ్ళు అయితే మేము బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకుంటారు.కాని చూసేవాళ్ళకి వాళ్ళది ఫ్రెండ్షిప్ కాదు లవ్ అని అర్ధమవుతుంది.వీళ్ళ రిలేషన్ వల్ల హౌస్ లో చాలా గొడవలే జరిగాయి. ఇక తాజగా మోనాల్ అఖిల్ ని ఆడియన్స్ దృష్టిలో బ్యాడ్ చేసి బ్రేకప్ చెప్పేసినట్లు అర్ధం అవుతుంది...తాజాగా 13 వారానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా.. మోనాల్ ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది.


అఖిల్, అవినాష్‌లకు లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకి ఇచ్చిపడేసింది. అవినాష్-అఖిల్‌ల మధ్య ఎవరు వీక్ అన్నదానిపై హాట్ డిస్కషన్ జరగ్గా.. హారిక-అభిజిత్ ఒకర్నొకరు నామినేట్ చేసుకున్నట్టుగా కనిపించింది.అఖిల్‌కి మరోసారి జలక్ ఇస్తూ.. మోనాల్ నామినేట్ చేసింది. దీంతో అఖిల్‌కి ఎప్పటిలాగే చిర్రెత్తుకొచ్చింది.. ‘నేను నీ కోసం ఇంత కొట్లాడుతున్నా.. నువ్ కూడా దిమాక్ పెట్టి గేమ్ ఆడతావని అనుకున్నా’ అని అఖిల్ ఫైర్ కావడంతో.. ‘నువ్ బ్రెయిన్‌తో గేమ్ ఆడతున్నావ్.. నేను హార్ట్‌తో గేమ్ ఆడుతున్నా’ అంటూ అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది మోనాల్. ఇప్పుడు నువ్ ఇవన్నీ చెప్పి.. ఆడియన్స్ ముందు నన్ను బ్యాడ్ చేస్తావా? అని అఖిల్ మోనాల్‌ని ప్రశ్నించాడు.


దీంతో వీళ్లిద్దరి మధ్య గొడవ ఎక్కువై బ్రేక్ అప్ అయిన సంగతి స్పష్టంగా అర్ధం అవుతుంది... ఇక ఈ మోనాల్ విషయానికి వస్తే  అఖిల్‌ని ఎందుకు నామినేట్ చేస్తుందో.. ఆ తరువాత మళ్లీ అతని వెనకాల ఎందుకు పడుతుందో.. హగ్‌లు ఇచ్చి మరీ మళ్ళీ ఎందుకు రెచ్చగొడుతుందో ఏమి అర్ధం కాదు. ఇక మోనాల్ పై బిగ్ బాస్ లవర్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ ఇద్దరితో బిగ్ బాస్ ఏం చేయించాలనుకుంటున్నాడో ఎవరికీ ఏం అర్ధం కావట్లేదు.ఇక ఏం జరుగుతుందో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే...ఇంకా ఇలాంటి మరెన్నో బిగ్ బాస్ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి: