బిగ్ బాస్ సీజన్ 4లో సోమవారం ఎపిసోడ్ ప్రోమో వచ్చింది. ఈ ప్రోమోలో కలర్ బాటిల్స్ తో ఈ వారం నామినేషన్స్ ఉంటాయని తెలుస్తుంది. ఇక ఎప్పటిలానే నామినేషన్స్ అనగానే గొడవలు సహజం. అఖిల్ తో అవినాష్ వాదనతో మొదలైన ప్రోమో.. హారిక నువ్వు కూడా నన్ను అర్ధం చేసుకోకపోతే ఎలా అని అభిజిత్ అన్నాడు. ఇక మరోసారి అఖిల్, మోనాల్ రిలేషన్ కటీఫ్ అయ్యేలా నామినేషన్స్ లో మోనాల్ అఖిల్ ను సెలెక్ట్ చేసుకుంది.

ఇక అరియానా నామినేట్ చేసే టైం లో మోనాల్ తో మాట్లాడుతుండగా ఆమె అరియానాకు సమాధానం చెబుతూ ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది. అలాంటి టైం లో అవినాష్ తెలుగులో మాట్లాడండని చెబుతాడు. అప్పుడు అవినాష్ మీద మోనాల్ సీరియస్ అయ్యింది. అందరు చెప్పే వారే అంటూ మోనాల్ కొద్దిగా ఓవర్ గా రియాక్ట్ అయ్యింది. 12వ వారం మోనాల్ సేఫ్ అవడం తనని తన మీద కాన్ ఫిడెన్స్ వచ్చినట్టు ఉంది. అందుకే మోనాల్ ఇలా ఓవర్ గా రియాక్ట్ అవుతుందని అంటున్నారు.

అయితే తెలుగులో మాట్లాడటం అని చెప్పడం కూడా అవినాష్ తప్పు ఎలా అవుతుంది. దానికి ఆమె ఎవరి మీద ఉన్న కోపమో మరొకరి మీద చూపించినట్టు ఉందని అంటున్నారు. ఇలా నామినేషన్స్ లో తన సీరియస్ నెస్ తో ఆడియెన్స్ మనసులో నెగటివ్ మార్క్ తెచ్చుకుంటుంది మోనాల్. మరి ఈ వారం ఆమెని సేఫ్ చేస్తారా లేక ఇంటికి పంపిస్తారా అన్నది చూడాలి.  

                                            \

మరింత సమాచారం తెలుసుకోండి: