అమ్మలు నిన్న మొన్నటి వరకు హీరోయిన్స్ గా చలామణి అయ్యారు. మరి అమ్మాయిలకేం తక్కువ..వారు కూడా బుల్లి తారలుగా ఇండస్ట్రీ లో సూపర్ ఛాన్స్ కొట్టేసారు. అస్సలు విషయంలోకి వెళ్తే టాలీవుడ్ లో హీరోయిన్స్ గా చలామణి అయ్యి పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయినా కొంత మంది నటీమణులు తమ కూతుళ్లను రంగం లోకి దింపుతున్నారు. వీరు తల్లుల కన్న అందంగా ఉంటూ వారి అమ్మల నుండి నటన వారసత్వాన్ని అందుకున్నారు. అంతే కాదు నటనలో తల్లుల కన్న ఏ మాత్రం తక్కువ కాదు అంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. మరి ఆ అమ్మలు, అమ్మాయిల ఎవరో ఒకసారి చూద్దాం.

ఈ లిస్ట్ లో మొదటగా చెప్పుకోవాల్సింది మీనా..హీరోయిన్ గా ఒక దశాబ్ద కాలం పాటు సౌత్ ఇండియన్ ఏలిన స్టార్ హీరోయిన్ మీనా మొదట బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసింది. ఇప్పడు తన అడుగుజాడలలో తన కూతురు కూడా మంచి నటనను ప్రదర్శిస్తుంది. మీనా కూతురు నైనికా అమ్మ కన్న అందంగా ఉంది.
 
ఇంకో స్టార్ హీరోయిన్ లయ. మూడు నంది అవార్డ్స్ ని దక్కించుకొని తక్కువ టైం లో స్టార్ గా గుర్తింపు తెచ్చుకొని 21 ఏళ్లకే పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోయింది. కానీ ఇన్నాళ్లకు కూతురిని టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేసింది. లయ కూతురు శ్లోక రవి తేజ అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో బాలనటిగా నటించింది.

మరొక స్టార్ట్ హీరోయిన్ మేనకా..ఈమె కూడా తమిళ్ తెలుగు వంటి సినిమాల్లో నటిచింది. ఇక కూతురు కీర్తి సురేష్ ని బాలనటిగా ఇండస్ట్రీ కి  పరిచయం చేయగా ఆమె ఇప్పుడు నెంబర్ వన్ హీరోయిన్ అయ్యింది

తర్వాత హీరోయిన్ సీత..ఈమె ఇప్పుడు సహాయక పాత్రల్లో నటిస్తుంది కానీ ఆమె హీరోయిన్ గా చేయునప్పుడు తన కూతురు అయినా కీర్తన ను బాలనటిగా పరిచయం అవ్వగా ఆమె నటించిన సినిమా తెలుగులో అమృత గా విడుదల అయ్యింది.

ఇలా తాము కాస్త ఫామ్ తప్పుగానే కూతుళ్లను స్టార్స్ గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ అమ్మలు

మరింత సమాచారం తెలుసుకోండి: