ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. "బాహుబలి" (సిరీస్ )లాంటి పాన్ ఇండియా మూవీ తీసి ఆల్ ఇండియా ఇండస్ట్రీ కొట్టాడు రాజమౌళి. ఆ సినిమాతో తెలుగు పరిశ్రమని అందుకోలేనంత ఎత్తులో నిలబెట్టాడు రాజమౌళి. ఇక ఆ సినిమా తరువాత దానికంటే భారీ రేంజ్ లో "ఆర్ ఆర్ ఆర్" సినిమాని 300 కోట్ల బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఈ సినిమాలో టాలీవుడ్ లో స్టార్ హీరోస్ గా దూసుకుపోతున్న రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి  తాజా షెడ్యూల్ నేటితో పూర్తయింది. ఈ షూటింగ్ విశేషాలు తెలుపుతూ సోషల్ మీడియా ద్వారా ద్వారా సందేశం పోస్ట్ చేసింది rrr టీమ్. గత కొన్ని రోజులుగా చిత్రంలోని కీలక ఘట్టాలను కెమెరాలో బంధించిన టీమ్.. నేటితో సెలవు తీసుకొని మరో షెడ్యూల్ ప్రారంభించడానికి రెడీ అవుతోంది.

''దాదాపు 50 రోజుల నైట్ షూట్ పూర్తి చేశాం. ఇక చలికాలపు రాత్రులకు గుడ్ బై.. ఇక తదుపరి షెడ్యూల్ కోసం వేరే దేశాల్లోని అందమైన ప్రదేశాలకు వెళ్లబోతున్నాం'' అని సందేశం ఇచ్చింది. ఇటీవలే లొకేషన్స్‌ వద్ద ఉన్న పరిస్థితులను వీడియో రూపంలో ప్రేక్షకుల ముందుంచారు మేకర్స్. ఈ వీడియోలో యూనిట్ సభ్యులు మొత్తం చలిలో వణుకుతూ షూట్‌లో పాల్గొంటున్నట్లు కనిపించారు. రాజమౌళి, ఎన్టీఆర్, కెమెరామెన్ సెంథిల్ కుమార్.. ఇలా అందరూ సెట్‌లో ఏర్పాటు చేసిన హీటర్స్ దగ్గర చలి కాచుకుంటూ కనిపించారు. ఈ షెడ్యూల్‌లో చెర్రీ, ఎన్టీఆర్‌లపై భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశామని చెప్పింది చిత్రయూనిట్.

ఈ పోరాట సన్నివేశాలు చిత్రంలో దాదాపు 20 నిమిషాల నిడివితో ఉంటాయని తెలిస్తోంది. ఆ సందర్భంలోనే తొలిసారి అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ కలుస్తారని.. అక్కడి నుంచే ఇద్దరూ ఒక్కటై పోరాటం కొనసాగిస్తారని సమాచారం. చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తుండగా.. వారి సరసన ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య  300 కోట్ల బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో అప్ డేట్స్ గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: