యాంకర్ గా సూఒపర్ ఫాం లో ఉన్న ప్రదీప్ అప్పట్లో కొన్ని సినిమాల్లో సైడ్ రోల్స్ వేస్తూ వచ్చాడు. అయితే స్మాల్ స్క్రీన్ పై కొద్దిగా క్రేజ్ పెరిగే సరికి సైడ్ రోల్స్ చేయడానికి ముందుకు రాలేదు. బుల్లితెర మీద మేల్ యాంకర్స్ లో బిజీగా ఉంది ఎవరు అంటే ముందు ప్రదీప్ పేరే చెబుతారు. ఇక లేటెస్ట్ గా ప్రదీప్ ను మెప్పించే కథ రావడంతో హీరోగా కూడా టర్న్ తీసుకున్నాడు.

ప్రదీప్ హీరోగా అమృత అయ్యర్ ఫీమేల్ లీడ్ గా వస్తున్న సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..? మున్నా డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఆల్రెడీ పూర్తయి రిలీజ్ కు రెడీగా ఉంది. అనూప్ రూబెన్స్ అందించిన మ్యూజిక్ వల్ల ఒక సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ఎక్కడ విన్నా నీలి నీలి ఆకాశం అంటూ ప్రదీప్ సినిమాపై సూపర్ బజ్ ఏర్పడేలా చేశారు. రిలీజ్ టైం కు కరోనా రావడం ఆ దెబ్బతో సినిమాల రిలీజ్ లు ఆగిపోవడం జరిగింది.

తన మొదటి సినిమాకే ఈ షాక్ ఊహించని ప్రదీప్ కొన్నాళ్లు వెయిట్ చేశాడు. అయితే కొన్ని సినిమాలు థియేటర్ లో అయినా.. ఓటిటి లో అయినా సినిమా బాగుంటే ఆడియెన్స్ ఆదరిస్తారని డేర్ స్టెప్ వేశారు. ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాకు కూడా ఓటిటి ఆఫర్స్ వచ్చాయట కాని చిత్ర దర్శక నిర్మాతలేమో కాని ప్రదీప్ అందుకు సుముఖంగా లేడని తెలుస్తుంది. మొదటి సినిమా థియేటర్ లో ఆడి సూపర్ హిట్ కొడదామని అనుకుంటే ప్రదీప్ సీన్ రివర్స్ అయ్యింది. అయితే ఇప్పటికైనా ప్రదీప్ ఓకే అంటే ఓటిటిలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. సో ఇప్పుడు బాల్ ప్రదీప్ కోర్ట్ లో ఉందని తెలుస్తుంది.              

మరింత సమాచారం తెలుసుకోండి: