అన్నకు పోటీగా దూసుకుపోతున్న ఆనంద్ దేవరకొండ

ఆనంద్ దేవరకొండ తన సెకండ్ ఫిలిం మిడిల్ క్లాస్ మెలోడీస్ తో ఒక హిట్ ను అందుకున్నాడనే చెప్పుకోవాలి. విజయ్ దేవరకొండ తమ్ముడైన సరే తనకంటూ స్పెషల్ మార్క్ ను అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. తన రెండు సినిమాల్లోనూ రెండు వైవిధ్యమైన పాత్రలను పోషించాడు. మొదటి సినిమా "దొరసాని"లో రాజు పాత్రలో పేద యువకుడిగా నటించాడు.

రెండవ సినిమాలో గుంటూరు అబ్బాయి రాఘవగా సందడి చేశాడు. మిడిల్ క్లాస్ గై కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు. రెస్టారెంట్ స్టార్ట్ చేయాలన్న సంకల్పంతో ముందుకువెళ్ళే యువకుడి పాత్రలో కనిపించాడు. ఈ క్యారక్టర్ లో ఒదిగిపోయాడు. విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి .

మొదటి సినిమా ప్రేక్షకులకు రీచ్ కాకపోయినా ఆ ఇంపాక్ట్ ఏదీ తన తదుపరి సినిమాలోని తన పాత్రపై పడకుండా బాగా నటించాడు. ఆనంద్ మొదటి సినిమా "దొరసాని" మంచి ప్రయత్నంగానే మిగిలింది. ఈ సినిమా ఆనంద్ కు మంచిపేరు తెచ్చినా కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. కానీ రెండవ సినిమాతో మాత్రం మంచి కమర్షియల్ హిట్ కట్టేశాడు .

మొదటి సినిమా నేరుగా థియేటర్స్ లో విడుదలైంది. రెండవ సినిమా ఓటీటీలో విడుదలైంది. ఆనంద్ విషయంలో లక్ ఏంటంటే, ఓటీటీలో విడుదలవడంతో ఎక్కువమందికి రీచయ్యింది. దాంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఏర్పడే అవకాశం దక్కింది .

ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన వర్ష కూడా తన నటనతో మంచి మార్కులే కొట్టేసింది. ఇటువంటి సబ్జెక్ట్స్ తో టాలీవుడ్ లో మంచి అవకాశాలే కొట్టేసే అవకాశాలున్నాయి ఈ భామకు.

సింపుల్ నేరేషన్ తో చక్కటి ఎమోషన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా అనేది ఇందులోని నటీనటులకు వెల్లువలా ఆఫర్స్ ను తెచ్చిపెడుతోందనే చెప్పుకోవాలి. ఆనంద్ దేవరకొండ డాడ్ గా నటించిన గోపరాజు రామన్న నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: