ఎప్పటికీ తరగని అందంతో కుర్రకారు హీరోలతో సైతం పోటీపడి మరీ తన క్రేజ్ ను పెంచుకుంటున్న హీరో అక్కినేని నాగార్జున. ఈ హీరో అమ్మాయిల కలల రాకుమారుడిగా మెలుగుతున్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మన్మధుడు వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే ఈ హీరోకు ఫ్యామిలీ ఆడియెన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి మంది ఆదరణను సంపాదించి పెట్టిన మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయన’. ఈ సినిమా ద్వారా అక్కినేని నాగార్జున భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. మూవీలో అక్కినేని నాగార్జున డబుల్ రోల్ చేసి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. అందులోనూ నాగార్జున బంగార్రాజుగా చేసిన క్యారెక్టర్ అయితే సూపర్ డూపర్ గా ఉందంటూ ప్రేక్షకులు అభినందనల వర్షం కురిపించారు.

ఆ పాత్ర ఆయనకు మంచి పేరు తెచ్చిందనే చెప్పుకోవచ్చు. అందుకే నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనకు సీక్వెల్ గా సినిమాను తెరకెక్కించేదుకు చిత్ర యూనిట్ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోందని సమాచారం. ఈ మూవీకి సంబంధించిన పనులను మొదలు పెట్టాడు ఈ బంగార్రాజు సినిమా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. అయితే ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ నెల నుంచి ప్రారంభం కాబోతోందని సమాచారం. ఈ మూవీలో బంగార్రాజుగా నటించనున్న నాగార్జున భార్యగా రమ్యకృష్ణ నటించ నున్నారు. అలాగే,  అక్కినేని వారసులైన నాగచైతన్య, అఖిల్ కూడా నటించబోతున్నారని వార్తలు వినిపించాయి.

అందులో నాగచైతన్య ఒక కీలక పాత్రలో నటించనున్నట్టు వార్తలు కూడా వినిపించాయి. అయితే రీసెంట్ గా ఈ మూవీ స్టోరీ లో పలు మార్పులు చేశారు. అదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అదేటంటే బంగార్రాజులో కీలక పాత్రలో నటించనున్నాడన్న నాగచైతన్య పాత్రను పూర్తిగా తొలగించారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కొన్ని కారణాల మూలంగా ఆ పాత్రను తొలగించినట్టు వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమాలో నాగార్జున తన చిన్న కొడుకు అఖిల్ ఈ మూవీలో సందడి చేయబోతున్నారని అర్థమవుతోంది. సినీ ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు కోసం పోరాడుతున్న అక్కినేని అఖిల్ కు ఈ సినిమా ఊరటనిస్తుందనే చెప్పుకోవచ్చు.

అయితే ఈ హీరో ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాత సురేంద్ రెడ్డితో ఓ సినిమాలో నటించబోతున్నాడు. అయితే వీటికంటే ముందే బంగార్రాజులో ఓ ప్రత్యేకమైన పాత్రలో నటించబోతున్నాడని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. అందులోనూ నాగార్జున తన చిన్న కొడుకు అఖిల్ పాత్రను ప్రత్యేకంగా డిజైన్ చేయించాడని వార్తలు కూడా వస్తున్నాయి. ఈ విషయం బయటకు తెలియడంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారనే చెప్పుకోవచ్చు. చూడాలి మరి ఈ మూవీ ఏ రేంజ్ లో ప్రేక్షకాదరణను సంపాదించుకుంటుందనేది..!

మరింత సమాచారం తెలుసుకోండి: