ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రాశిఖన్నా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. టాలీవుడ్ అలాగే కోలీవుడ్ ప్రేక్షకుల నుంచి ప్రేమాభిమానాలను సంపాదించుకుంది. ఈ ఢిల్లీ భామ కేవలం అందంతోనే కాదు తెలివితేటలతో కూడా దిట్టే అన్న పేరును తన పాత్రల ఎంపికల ద్వారా సొంతం చేసుకుంది. అలాగే, రాశిఖన్నా పాటలు కూడా బాగా పాడుతుంది. తనకు గ్రామీణ యువతి పాత్రలో నటించాలన్న డ్రీం ఉందని తన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఒకానొక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

తన గ్లామర్ ని ఎలాగో ప్రేక్షకులు అభిమానించారు తన పెర్ఫామెన్స్ ని కూడా అభిమానించే రోజు కావాలని కోరుకుంటోంది రాశి ఖన్నా. ఊహలు గుసగుసలాడే చిత్రంద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రాశి హిందీలో కూడా లక్ టెస్ట్ చేసుకోవడానికి సిద్ధమైంది. బెంగాల్ టైగర్, సుప్రీమ్, జై లవ కుశ, తొలి ప్రేమ, వెంకీ మామ అలాగే ప్రతి రోజు పండగే వంటి చిత్రాలతో పాటు మరికొన్ని  సినిమాల్లో సందడి చేసింది ఈ భామ. తెలుగుతో పాటు తమిళ చిత్రపరిశ్రమలో తనకంటూ ఫ్యాన్ ఫాలోవింగ్ ను ఏర్పరచుకుంది. రాశిఖన్నాను విక్టరీ వెంకటేష్ స్పెషల్ బర్త్ డే విషెస్ ను సోషల్ మీడియా ద్వారా అందించాడు.


హ్యాపీ బర్త్ డే డియర్, ఈ ఏడాది కూడా నీకు బ్యూటిఫుల్ గా ఉండాలి అని విషెస్ చెప్పాడు వెంకీమామ. డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా రాశీఖన్నాకు స్పెషల్ విషెస్ ను అందించాడు. రాశిఖన్నా తన పుట్టినరోజులు తన కుటుంబసభ్యులతో జరుపుకుంది. కేట్ కట్ చేసి బ్యూటిఫుల్ మూమెంట్స్ ను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంది. తన డాడ్ ను హగ్ చేసుకున్న ఫోటో అలాగే తన మదర్ కు కేక్ ను అందిస్తున్న ఫోటోను రాశి షేర్ చేసిన పిక్స్ లో గమనించవచ్చు. రాశి తన కుటుంబాన్ని ఎంత ప్రేమిస్తుందో ఇక్కడే క్లియర్ గా అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: