ఈ ఏడాది  బిగినింగ్ లో అల వైకుంఠపురములో సినిమా తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా పుష్ప. తనకెంతో ఇష్టమైన సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న ఈ సినిమాపై ఆయన ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. తొలిసారిగా అల్లు అర్జున్ కి జోడిగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తుండగా టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తోంది.

ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కి ప్రేక్షకాభిమానుల నుండి మంచి స్పందన లభించింది. మంచి మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు టాక్. ఇందులో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే మాస్ పాత్ర పోషిస్తుండగా ఒక ప్రముఖ బాలీవుడ్ నటుడు విలన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల ఈ సినిమా తాజా షెడ్యూల్ ప్రారంభమైంది. కాగా ఈ సినిమాని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే లేటెస్ట్ గా కొన్ని ఫిల్మ్ నగర్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని జనవరి ఒకటో తేదీన అనగా 2021వ సంవత్సరం తొలి రోజున ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట. ఇప్పటికే టీజర్ కు సంబంధించిన వర్క్ పుష్ప యూనిట్ ప్రారంభించిందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమైతే ఇది నిజంగా బన్నీ ఫాన్స్ కి సూపర్ న్యూస్ అని చెప్పక తప్పదు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: