ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..నాగ సౌర్య మొదట్లో లవర్ బాయ్ గా మంచి మంచి సినిమాలు చేసి ఆకట్టుకున్నాడు. తరువాత అదే రీతిలో కాకుండా చాలా డిఫరెంట్ గా మూవీస్ చేస్తున్నాడు. ఇప్పుడు సంతోష్‌ జాగర్లపూడి తో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రానికి ‘ల‌క్ష్య’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రక‌టిస్తూ సోమవారం స్పెష‌ల్ పోస్టర్‌‌ను విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌. ఈ పోస్టర్‌లో నాగ‌శౌర్య లుక్ ఆక‌ట్టుకుంటోంది.

కండలు తిరిగిన శరీరంతో పెద్ద బాడీ బిల్డర్ లా  కనిపిస్తున్నాడు.నాగ‌శౌర్య కెరీర్‌లో 20వ చిత్రంగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ నుండి ఇప్పటికే విడుద‌ల‌చేసిన స్టన్నింగ్‌ ఫస్ట్‌లుక్ అంద‌రినీ థ్రిల్ చేసింది. ‘ది గేమ్ విల్ నెవ‌ర్ బీ ద సేమ్’ అంటూ ఎయిట్‌ ప్యాక్ బాడీతో చేతిలో బాణం ప‌ట్టుకుని వారియ‌ర్ పోజ్‌లో నాగ‌శౌర్య నిల్చొని ఉన్న లుక్ చాలా బాగా ఆకట్టుకుంటుంది.
ప్రాచీన విలువిద్య బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ బేస్డ్ ఫిలింగా అన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. అంతేకాదు, ఆర్చరీ మీద రూపొందుతోన్న తొలి భారతీయ చిత్రమిది.ఈ సినిమాతో పాటు ఇంకా  రెండు సినిమాల్లో చేస్తున్నాడు నాగ సౌర్య. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో ‘వరుడు కావలెను’ అనే సినిమాలో నటిస్తున్నాడు. రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్‌లో ఒక రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చేస్తున్నారు. ఈ చిత్రంలో షర్లీ సేతియా హీరోయిన్‌గా ఎంపికైంది. అనీష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోండి...









మరింత సమాచారం తెలుసుకోండి: