బిగ్ బాస్ ఆడియెన్స్ కొందరు అర్ధం పర్ధం లేని వాదనతో సోషల్ మీడియాలో హంగామా చేస్తారు. తమకు నచ్చిన కంటెస్టంట్స్ ను ఇష్టపడుతూ వారికి వారం వారం ఓట్స్ వేస్తూ వచ్చే ఆడియెన్స్. ఆ కంటెస్టంట్ ను హౌజ్ లో ఎవరైనా టార్గెట్ చేస్తే ఆ టార్గెట్ చేసిన వారిపై ఎటాక్ చేస్తారు. ఇక లేటెస్ట్ బిగ్ బాస్ సీజన్ లో అభిజిత్ ఫ్యాన్స్ కొద్దిగా ఓవర్ చేస్తున్నరని అనిపిస్తుంది. అదేంటి అంటే వీకెండ్ ఎపిసోడ్ లో అభిజిత్ పై నాగార్జున సీరియస్ అయ్యారు. అయితే దానికి నాగార్జునని సైతం తప్పుపడుతూ అభిజిత్ సోషల్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు.

అదేదో ఆయన హౌజ్ లో ఏదో పొడిచేసినట్టు ఫీల్ అవుతున్నారు. అతని ఆడిన మైండ్ గేం లో ఒకటి హిట్ అయ్యింది. మిగతా సీజన్ అంతా సోఫాలో కూర్చుని వేడి నీళ్లు తాగడమే అని యాంటీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నా. అభిజిత్ సోషల్ ఫాలోవర్స్ అభిజిత్ ను, నాగార్జునను ఒకే లైన్ మీదకు తెచ్చారు. అసలు నాగార్జున స్థాయితో పోల్చితే అభిజిత్ ఎక్కడ చెప్పండి. పట్టు మని ఓ సూపర్ హిట్ కొట్టని హీరో. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తర్వాత అడ్రెస్ కూడా లేడు.

ఇక ఇప్పుడు బయటకు వచ్చిన అభిజిత్ సినిమా చేస్తే ఈ సోషల్ ఫాలోవర్స్ ఏమాత్రం హిట్ చేస్తారో చూడాలి. ఆటలో మన వాళ్లని అన్నా.. అవతల వాళ్లని అన్నా సరే కొద్దిగా ఓపిక పట్టాలి. అంతేకాని హోస్ట్ ను అంటే వారి ఫ్యాన్స్ ఊరుకుంటారా.. అలా చేస్తే అభిజిత్ కు వ్యతిరేకంగా అక్కినేని ఫ్యాన్స్ నెగటివ్ ఓటింగ్ వేసే అవకాశం ఉంది. కాబట్టి అభి కాని మిగతా హౌజ్ మేట్స్ ఫ్యాన్స్ హోస్ట్ గా చేస్తున్న నాగార్జున ఎవరు ఏంటి అన్నదాని గురించి ఆలోచించి ఆయన్ను కామెంట్ చేస్తే బెటర్.  

మరింత సమాచారం తెలుసుకోండి: