నాచురల్ స్టార్ నాని హీరోగానే కాదు నిర్మాతగా కూడా సినిమాలు చేస్తుంటాడు. ఈ ఇయర్ మొదట్లో నాని నిర్మాతగా శైలేష్ డైరక్షన్ లో వచ్చిన సినిమా హిట్. ఫలనుమా దాస్ తో పాపులర్ అయిన విశ్వక్ సేన్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే సినిమాకు కొనసాగింపు ఉన్నట్టుగా చివర్లో షాక్ ఇచ్చాడు డైరక్టర్. హిట్ ఫస్ట్ కేస్ అయ్యింది సెకండ్ కేస్ కు రెడీ అవ్వాలని అన్నారు.

అయితే కొన్నాళ్లుగా ఈ సీక్వల్ పై సైలెంట్ గా ఉన్న శైలేష్ ప్రస్తుతం ఈ సీక్వల్ ప్లానింగ్ లో ఉన్నాడని తెలుస్తుంది. హిట్ సీక్వల్ షురూ చేస్తున్నారట. అయితే ఈ సీక్వల్ సినిమాలో హీరో మారుతున్నాడని టాక్. విశ్వక్ సేన్ బదులుగా ఈ సీక్వల్ లో అడివి శేష్ నటిస్తాడని అంటున్నారు. ఇలాంటి సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన అడివి శేష్ శైలేష్ తో హిట్ 2కి సిద్ధం అవుతున్నాడట.

ప్రస్తుతం అడివి శేష్ గూఢచారి 2, మేజర్ సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాల తర్వాత హిట్ 2 ప్లాన్ చేస్తున్నారట. హిట్ ఫస్ట్ కేస్ కన్నా సెకండ్ మూవీ మరింత సస్పెన్స్ తో వస్తుందని అంటున్నారు. స్క్రిప్ట్ బాగా రావడంతో అడివి శేష్ ఈ సినిమాపై తన ఆసక్తి కనబరిచాడని తెలుస్తుంది. అయితే ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న మరో టాక్ ఏంటంటే ఈ సినిమాలో అడివి శేష్ తో పాటుగా విశ్వక్ సేన్ కూడా ఉంటాడని అంటున్నారు. మరి ఈ విషయంపై త్వరలో క్లారిటీ వస్తుంది.                                              

మరింత సమాచారం తెలుసుకోండి: