పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నాడు. వకీల్ సాబ్ తర్వాత వరుసగా ఐదారు సినిమాలు లైన్ లోఫ్ ఉన్నాయి. ఇక లేటెస్ట్ గా డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ కు పవర్ స్టార్ సినిమా ఛాన్స్ ఇస్తాడని టాక్. అదేంటి కొరియోగ్రాఫర్ కు ఛాన్స్ ఇవ్వడం ఏంటని అనుకోవచ్చు. పవర్ స్టార్ వీరాభిమాని అయిన జానీ మాస్టర్ పవర్ స్టర్ కోంస ఓ కథ రాసుకున్నాడట. అది పవన్ కు వినిపించడం ఆమోద ముద్ర వేసుకోవడం జరిగిందని టాక్.

పవన్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకున్నాడట జానీ మాస్టర్. ఈ సినిమాను రాం చరణ్ నిర్మిస్తాడని అంటున్నారు. అదే జరిగితే ఓ అభిమాని ఎలా చూడాలని అనుకుంటున్నారో పవన్ ను అలా చూపించి సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు జానీ మాస్టర్. మరి సడెన్ గా జానీ మాస్టర్ కు ఈ డైరక్షన్ ఆలోచన ఎందుకు వచ్చిందో ఏమో కాని పవర్ స్టార్ తో ఛాన్స్ పట్టేస్తే ఇక డైరక్టర్ గా కూడా క్రేజ్ తెచ్చుకున్నట్టే.

పవన్ సినిమాను నిర్మిస్తున్న చరణ్ జానీ మాస్టర్ వర్కింగ్ స్టైల్ నచ్చితే మాత్రం ఇక నెక్స్ట్ సినిమా అతనికే ఛాన్స్ ఇస్తాడు. మరి జానీ మాస్టర్ డైరక్టర్ గా మారుతున్నాడన్న వార్తలపై ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. మెగా హీరోలకు ది బెస్ట్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా క్రేజ్ తెచ్చుకున్న జానీ మాస్టర్ పవర్ స్టార్ ను డైరెక్ట్ చేస్తే మాత్రం ప్రతి పవన్ అభిమాని కాలర్ ఎగురవేసేలా సినిమా చేస్తాడని చెప్పొచ్చు.                                                  

మరింత సమాచారం తెలుసుకోండి: