పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి టాలీవుడ్ లో టాప్ హీరోగా ఉన్న క్రేజ్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆయన నటించిన 25 సినిమా అజ్ఞాతవాసి. మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొత్తది. ఇక దాని అనంతరం పూర్తిగా రాజకీయాల్లో బిజీ అయిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నారు. వాటిలో ఒకటి వకీల్ సాబ్ కాగా మరొకటి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక మూవీ. కాగా వీటిలో వకీల్ సాబ్ ఇప్పటికే చాలా వరకు షూటింగ్ ని పూర్తి చేసుకోగా దీనిని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మరోవైపు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ సినిమాని ఏఎం రత్నం నిర్మిస్తుండగా కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు.  

కాగా ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఇక పోతే ఈ రెండు సినిమాల అనంతరం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా తో పాటు సురేందర్ రెడ్డి, సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ మరో మూడు సినిమాలు చేయనున్న విషయం తెలిసిందే. ఇటీవల వీటికి సంబంధించి అధికారిక ప్రకటనలు కూడా వచ్చాయి. ఇకపోతే వీటి తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా తో పాటు కంత్రి, శక్తి సినిమాల దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో కూడా పవర్ స్టార్సినిమా చేయనున్నట్లు నిన్నటి నుంచి పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి.

వాటిని బట్టి అతి త్వరలో మెగాస్టార్ తో వేదళం రీమేక్ చేయనున్న మహేష్ రమేష్ ఇప్పటికే పవన్ కోసం కూడా ఒక పవర్ఫుల్ స్టోరీని సిద్ధం చేసుకున్నారని ఇటీవల దానిని పవన్ కి వినిపించడం ఆయన నుండి గ్రీన్ సిగ్నల్ కూడా అందుకోవడం జరిగిందని అంటున్నారు. టాలీవుడ్ కి చెందిన ఒక అగ్ర నిర్మాణ సంస్థ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నట్లు టాక్. అయితే మెహర్ రమేష్ సినిమాపై పవన్ ఫ్యాన్స్ నుంచి కొంత మిశ్రమ స్పందన వస్తున్నట్లు సమాచారం. కొందరు మాత్రం సినిమా చేయమని కోరుతూ ఉంటే మరికొందరు మాత్రం వద్దు బాబోయ్ ఆయనతో సినిమా వద్దే వద్దు అంటూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న మాదిరిగా పవన్, మెహర్ రమేష్ కాంబినేషన్లో సినిమా ఉంటుందో లేదో తెలియాలి అంటే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: