టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తొలి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాహుబలి రెండు సినిమాల వరకూ కెరీర్ పరంగా వరుస విజయాలతో అపజయం ఎరుగని దర్శకుడిగా దిగ్విజయంగా దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే రాజమౌళి దర్శకత్వ శైలి మిగతా దర్శకులు అందరికంటే కూడా కొంత భిన్నంగా ఉంటుందనేది ఆయనతో కలిసి పనిచేసిన వారు చెప్పే మాట. మొదటి నుంచి సినిమానే ప్రాణంగా భావించే రాజమౌళి ముఖ్యంగా తన సినిమాల విషయమై ప్రతి ఒక్క అంశంలోనూ ఎంతో జాగ్రత్త తీసుకుంటారని అలానే ఏదైనా సన్నివేశం తీసినప్పుడు దానిని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని యూనిట్ మొత్తాన్ని సంప్రదించిన అనంతరం దానిని ఓకే చేస్తారని సమాచారం. ఇక ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమా ఆర్ ఆర్ ఆర్. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా రాంచరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా కీరవాణి సంగీతాన్ని విజయేంద్రప్రసాద్ కథని సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు.

డి.వి.వి.దానయ్య దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులతో పాటు దేశ విదేశాల్లో ఉన్న ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే ఈ సినిమాని వాస్తవానికి ముందుగా ఈ ఏడాది జూలై 30న రిలీజ్ చేయాలని భావించారు. అయితే గ్రాఫిక్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ యొక్క ఆలస్యం కారణంగా దానిని వచ్చే ఏడాది జనవరి 8 కి వాయిదా వేయడం జరిగింది. ఇక ఇటీవల కరోనా కారణంగా విధించబడిన లాక్ డౌన్ వలన ఆర్ఆర్ఆర్ షూటింగ్ కూడా నిలిపివేయడంతో దానిని మరొకమారు వచ్చే ఏడాది వేసవి తర్వాత రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

నిజానికి సినిమా రిలీజ్ పై ఇప్పటివరకు ఆర్ఆర్ఆర్ యూనిట్ క్లారిటీ ఇవ్వకపోవడానికి కారణం ఉందని, నిజానికి ఈ ఆర్.ఆర్.ఆర్ సినిమా అవుట్ పుట్ విషయమై రాజమౌళి ఎంతో జాగ్రత్త వహిస్తున్నారని రిలీజ్ కొంత ఆలస్యం అయినా సరే అన్ని అంశాల పట్ల మరింత కేర్ తీసుకొని పరిశీలించిన అనంతరం రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేయాలనేది రాజమౌళి ఆలోచనట. ఒకరకంగా రాజమౌళి చేస్తున్న ఈ ఆలోచన అనితరసాధ్యమైనదని, ఎంతో దూరదృష్టి ఉండకపోతే ఈ విధంగా ఆలోచించడం కుదరని పని అని, అందుకే ఆయన దర్శకధీరుడిగా టాలీవుడ్ లో కొనసాగుతున్నారని పలువురు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: