పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ కోర్టు డ్రామా సినిమా వకీల్ సాబ్. పవన్ కళ్యాణ్ లాయర్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రుతిహాసన్ ఆయనకు జోడీగా నటిస్తుండగా ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు స్వరాలు అలానే ప్రముఖ ఛాయాగ్రాహకుడు పి.ఎస్.వినోద్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. లాక్‌డౌన్ కి‌ ముందు చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్లో ప్రారంభమైంది.

ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ యాక్షన్, డైలాగులు ముఖ్యంగా కోర్టు సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవన్నట్లు టాక్. ఇటీవల ఈ సినిమా నుండి బయటకు వచ్చిన మగువా మగువా అనే పల్లవితో సాగే సాంగ్ తో పాటు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ మంచి స్పందన రాబట్టి సినిమాపై అభిమానుల్లో భారీ రెస్పాన్స్ క్రియేట్ చేశాయి. అతి త్వరలో ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా విడుదల విషయంలో మాత్రం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన బయటకు రాలేదు. దిల్ రాజు, బోనికపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తారు అంటూ కొద్ది రోజులుగా వార్తలు మాత్రం పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్నాయి.

అయితే అది నిజమేనని దానిపై అతి త్వరలో ప్రకటన రానుంది అనేది పవన్ సన్నిహితులు చెప్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వచ్చే ఏడాది తొలి సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేది వకీల్ సాబ్ మూవీ అని ఆ విధంగా 2011లో పవన్ కళ్యాణ్ తొలి జెండాని టాలీవుడ్ లో పాతనున్నారని సమాచారం. మరి మరి వకీల్ సాబ్ సినిమా ద్వారా మూడేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న పవన్ కళ్యాణ్ ఏ రేంజి సక్సెస్ ని అందుకుంటారో చూడాలి....!!





మరింత సమాచారం తెలుసుకోండి: