యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ అభిమానులు చాలా ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు గానీ, 'ఆది పురుష్' టీమ్‌ మాత్రం అంత సీరియస్‌గా తీసుకోవడం లేదు. భారీ అంచనాలొద్దు, చాలా సింపుల్‌గా తేల్చేస్తాం అని హింట్స్‌ ఇస్తున్నారు. దీంతో లాంచింగ్‌కి ముందే 'ఆదిపురుష్'పై విమర్శలు మొదలయ్యాయి. ప్రభాస్‌ని ట్రోల్‌ చేస్తున్నారు నెటిజన్లు.

ప్రభాస్‌ రామాయణ గాథ ఆధారంగా 'ఆదిపురుష్' చేస్తున్నాడనగానే అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. రాముడిగా ప్రభాస్‌ ఎలా ఉంటాడు, సీత పాత్ర ఎవరు చేస్తారు, లక్ష్మణుడు, హనుమంతుడి పాత్రలకి ఎవరిని తీసుకుంటారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ బాలీవుడ్‌ ప్రచారంతో ఈ ఆసక్తి తగ్గిపోతోందనే కామెంట్స్‌ వస్తున్నాయి.

రామాయణగాథ ఆధారంగా తెరకెక్కుతోన్న 'ఆదిపురుష్‌'కి భారీ స్టార్స్‌ని తీసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ మేకర్స్‌ మాత్రం ఆర్టిస్టులుగా ప్రూవ్‌ చేసుకోనోళ్లని, పెద్దగా స్టార్డమ్‌లేనోళ్లని తీసుకుంటున్నారు. ఇప్పటివరకు హీరోయిన్‌గా మార్క్‌ చూపించని కృతిసనన్‌ని సీత పాత్రకి ఫైనల్‌ చేశాడట డైరెక్టర్‌ ఓమ్ రౌత్.

లక్ష్మణుడి పాత్రకి సన్నీ సింగ్‌ని ఓకే చేశారనే ప్రచారం జరుగుతోంది. దీంతో రామాయణం స్థాయికి తగ్గ ఆర్టిస్టులని తీసుకోవడం లేదని, యాక్టింగ్‌ రానోళ్లని సెలక్ట్‌ చేస్తున్నారని విమర్శిస్తున్నారు బాలీవుడ్‌ జనాలు. అంతేకాదు ప్రభాస్‌నీ విమర్శిస్తున్నారు. 'ఆదిపురుష్' స్టార్‌క్యాస్టింగ్‌ గురించి ప్రభాస్‌ పట్టించుకోడా.. కథకి సరిపోయేవాళ్లని తీసుకొమ్మని దర్శకనిర్మాతలకు చెప్పే ధైర్యం కూడా లేదా అని ట్రోల్‌ చేస్తున్నారు నెటిజన్లు.  

మొత్తానికి ఆదిపురుష్ సినిమా ఎప్పుడు మొదలైపోయిందో అందరిలో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఆ సినిమాలో ప్రభాస్ నటిస్తుండటంతో వరల్డ్ వైడ్ అభిమానుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ఆ సినిమాలో నటించే వాళ్ల ఎంపికలో చిత్ర యూనిట్ ఫెయిల్ అవుతుందనే వార్తలు గుప్పుమంటున్నాయి.

యాక్టింగ్ లో ఆరితేరినవాళ్లను ఇలాంటి సినిమాకు ఎంపిక చేసుకోవాలి గానీ.. పెద్దగా గుర్తింపు లేనివాళ్లను సెలక్ట్ చేసుకున్నారనే విమర్శలు తలెత్తుతున్నాయి.   చూద్దాం.. ఆదిపురుష్ చిత్ర యూనిట్ ఇలాంటి విమర్శలకు ఎలాంటి సమాధానం ఇస్తుందో.




మరింత సమాచారం తెలుసుకోండి: