పవన్ కళ్యాణ్ తో సినిమా తీయడం కోన వెంకట్ జీవిత ధ్యేయం. తన కల నిజం చేసుకునేందుకు కోనవెంకట్ ఎన్నో కథలు పవన్ కు వినిపించినా ఇప్పటికీ పవన్ మనసు కరిగి కోనవెంకట్ కు ప్రామిస్ దక్కలేదు. ‘నిశ్శబ్దం’ ఫెయిల్యూర్ తో దిగాలు పడ్డ కోనవెంకట్ కు ఇప్పుడు బాలకృష్ణ ప్రామిస్ దక్కినట్లుగా వార్తలు హడావిడి చేస్తున్నాయి.


ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ఈమధ్య బాలయ్య కోనవెంకట్ తనకు చెప్పిన కథకు ఓకె చెప్పినట్లు హడావిడి జరుగుతోంది. బాలయ్య ఇప్పటికే కమిట్ అయిన ఒక సినిమాను చేసిన తర్వాత కోనవెంకట్ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పాడని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. బాలకృష్ణ కోసం కోనవెంకట్ తయారు చేసిన ఒక మాస్ ఎంటర్ టైనర్ మూవీ కథకు బాలయ్య ఓకె చెప్పాడు అని అంటున్నారు.


ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు శ్రీవాస్ డైరెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మాస్ ఎంటర్ టైనర్ సినిమాలను శ్రీవాస్ చక్కగా డీల్ చేయగలడు అన్న నమ్మకం బాలయ్యకు ఉండటంతో పాటు గతంలో శ్రీవాస్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన సందర్భంలో అప్పట్లోనే శ్రీవాస్ తో బాలయ్యకు సన్నిహిత సంబంధం ఏర్పడింది అని అంటారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే ఆస్కారం ఉంది. ప్రస్తుతం కోనవెంకట్ వైపు టాప్ హీరోలు ఎవరు చూడటంలేదు. ఇలాంటి పరిస్థితులలో బాలయ్య ఇస్తున్న అవకాశం కోనవెంకట్ కు ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి.


అంచనాల ప్రకారం బోయపాటి బాలయ్యల లేటెస్ట్ మూవీ వచ్చే ఏడాది విడుదలై సూపర్ హిట్ అందుకుంటే మళ్ళీ బాలయ్య ట్రాక్ లోకి రావడం ఖాయం. అదే జరిగితే బాలయ్యతో సినిమా తీయాలని ప్రయత్నిస్తున్న కోనవెంకట్ కష్టాలు అన్నీ ఒకేసారి తీరిపోయే ఆస్కారం ఉంది. అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఈ మూవీ 2022 లో విడుదలయ్యే అవకాశం ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: