టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్ర దర్శకులలో నంబర్ వన్ డైరెక్టర్ ఎవరంటే.. మనకు ముందుగా గుర్తొచ్చే పేరు రాజమౌళి. తన కెరీర్ లో ఒక్క అపజయం లేకుండా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు మన జక్కన్న. ఇక రాజమౌళి తో సినిమాలు చేసిన హీరోలకు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో క్రేజ్ వస్తుంది. అలా కేవలం ఒక్క సినిమాతో మన రెబల్ స్టార్ ప్రభాస్ రేంజే మారిపోయింది. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ వవిజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో  ప్రభాస్‌ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. చేస్తే పాన్‌ ఇండియా సినిమానే చేయాలి అనేలా ప్రభాస్‌ స్టార్ డమ్ పెరిగిపోయింది. ఇప్పుడు ప్రభాస్‌ చేసే సినిమాలన్నీ కూడా పాన్‌ ఇండియా సినిమాలే.

 అలాగే పాన్‌ ఇండియా స్టార్‌కి సరికొత్త నిర్వచనం ప్రభాస్‌ అనే రేంజ్‌కి వెళ్లిపోయాడు ప్రభాస్‌. మరి అటువంటి ప్రభాస్‌ని మరోసారి డైరెక్ట్ చేస్తారా? అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజమౌళికి ఓ ప్రశ్న ఎదురైంది.దీనికి రాజమౌళి సమాధానమిస్తూ.. ''వామ్మో.. మళ్లీ ప్రభాస్‌తోనా?.. బాహుబలి కోసం దాదాపు 5 సంవత్సరాలు కలిసి చేశాం. మళ్లీ మా కాంబినేషన్‌లో సినిమా అంటే.. జనాలు తలలు పట్టుకుంటారేమో..'' అని అన్నారు. ఇదంతా నిజమే అనుకుంటున్నారేమో? కాదు..మన రాజమౌళి ఈ మాటలు సరదాగా మాట్లాడారు. పై మాటలు అన్న తర్వాత సరదాగా నవ్విన రాజమౌళి.. ''సరదాగా అలా అన్నాను.. నిజంగా ప్రభాస్‌తో సినిమా చేయడం నాకు కూడా ఇష్టమే.

 మంచి కథ కుదిరితే.. తప్పకుండా మేం మళ్లీ సినిమా చేస్తాం..'' అని రాజమౌళి చెప్పుకొచ్చారు.మళ్ళీ ఈ కాంబినేషన్ కోసం చాలా మంది ప్రేక్షకులతో పాటు అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. ఫ్యూచర్ లో మళ్లీ ఈ కాంబో సెట్ అయితే మరోసారి బాక్సఫీస్ బద్దలైనట్లే మరి. ఇక ప్రస్తుతం రాజమౌళి..ఎన్టీఆర్, చరణ్ లతో rrr సినిమాను తెరకిక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. తాజాగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లో షూటింగ్ ముగించుకొని.. ఇటీవలే పూణే వెళ్లినట్లు సమాచారం. అక్కడ ఓ వారం రోజులు షూటింగ్ జరుపుతారట.ఈ షెడ్యూల్ లో హీరోలిద్దరిపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రికరించనున్నాడు జక్కన్న...!!

మరింత సమాచారం తెలుసుకోండి: