నాకంటూ ఓ రూట్ ఉంది. నా సినిమా కథలకు ఓ లెక్కుంది...!! అంటూ వైవిధ్యభరిత సినిమాలతో అందరినీ ఆకట్టుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు దర్శకుడు సుకుమార్. జగడం,100% లవ్, ఆర్య, నాన్నకు ప్రేమతో , రంగస్థలం,  వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన ఘనుడు సుకుమార్. అయితే సూపర్ స్టార్ మహేష్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన ‘1-నేనొక్కడినే’ సినిమా మాత్రం అనుకున్న ఫలితాలు అందించలేదు. బాక్సాఫీస్ వద్ద నిరాశనే మిగిల్చింది. కానీ వీరి కాంబినేషన్ మాత్రం అదుర్స్ అంటూ.. ఈసారి మంచి స్టొరీ తో మరోసారి  తప్పకుండా మా ముందుకు రావాలంటూ అభిమానులు ఆకాంక్షించారు. కానీ ఎవరి షెడ్యూళ్లలో వాళ్ళు బిజీగా ఉండడంతో ఇప్పటి వరకు అది కుదరలేదు.

 అయితే ఇన్నాళ్ళకి ఆ కల నెరవేరే సమయం వచ్చినట్లు సూచనలు అందుతున్నాయి. ప్రత్యేకంగా మహేష్ బాబు కోసం  ఓ కథ సిద్ధం చేశాడు సుకుమార్. ఇప్పటికే ఆ స్టొరీ ని మహేష్ కు వినిపించారని... కథ నచ్చడంతో ప్రిన్స్ కూడా ఓకే అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కాకపోతే మహేష్ డేట్స్ విషయంలో ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమా తో సుకుమార్ బిజీగా ఉండగా... ఈ చిత్రం అనంతరం మహేష్ తో కలసి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రారంభించనున్నారని టాక్ వినిపిస్తోంది.

ఎప్పుడు ఏంటన్నది వివరాలు ఇప్పుడు పూర్తిగా చెప్పలేము కానీ... వీరి కాంబినేషన్లో సినిమా మాత్రం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు. ప్రస్తుతానికి బన్నీతో బ్లాక్ బాస్టర్ కొట్టేందుకు ఫుల్ ప్లానింగ్ తో దూసుకుపోతున్నాడు సుకుమార్. ఆ తర్వాత మిల్క్ బాయ్ తో జతకట్టనున్నట్లు సమాచారం. మరి ఈ క్రేజీ డైరెక్టర్ సుకుమార్.. అమ్మాయిల కలల రాకుమారుడు మహేష్ బాబు కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: