సాధారణం గా మనిషులను పోలిన మనుషులు ఉంటారు, అలాగే మనుషుల జీవితాలను పోలిన మనుషులు తక్కువే ఉంటారు. ఇప్పుడు మీరు తెలుసుకోబోయే ఇద్దరు హీరోల భార్యల జీవితాలు ఒకేలా ఉంటాయి. ఒకేలా మొదలయ్యి, ఒకేలా సాగుతున్నాయి.  మరి వాళ్లెవరో కాదు ఒకరేమో యాక్షన్ హీరో అర్జున్ భార్య ఆశ రాణి, మరొకరు పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణుదేశాయ్. నిజానికి వీరిద్దరికి ఎలాంటి సంబందం కానీ ముఖ పరిచయం కూడా లేవు. ఒకరేమో టాలీవుడ్ మరొకరేమో కోలీవుడ్. కానీ తరచి చూస్తే ఇద్దరు ఒకే లాగా తమ జీవితం ప్రయాణం ఎంచుకున్నారు. అవేంటి ఇప్పడు చూద్దాం.

మొదట రేణు దేశాయ్ వివరాల్లోకి వెళ్తే..పవన్ తో ఒక్క విడాకుల విషయం పక్కన పెడితే ఆమె మిగిలిన జీవితం అంత ఆషారాణి తో సరితూగుతుంది. రేణు సినిమా ఫీల్డ్ లో కి రాకముందు మోడలింగ్ రంగంలో పని చేసింది. అక్కడ నుండి తొలి అవకాశం బద్రి సినిమాలో రాగా పవన్ కళ్యాణ్ తో కలిసి ఈ చిత్రం లో నటించింది. ఇక రేణు కి ఇదే చివరి సినిమా కావడం విశేషం. ఆ సినిమా షూటింగ్ సమయంలో రేణు పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పాడారం ఆమె సినిమాలకు స్వస్తి పలకడం రెండు జరిగిపోయాయి. పవన్ కి మొదటి భార్యతో విడాకులు రాని కారణం గా ఇద్దరు సహజీవనం చేసి ఒక బాబు పుట్టాక పెళ్లి చేసుకున్నారు. రేణు పవన్ కళ్యాణ్ అన్ని సినిమాలకు తానే ఫ్యాషన్ డిజైనర్ గా పని చేసింది. పిల్లలు పుట్టాక మనస్పరదాలతో విడాకులు తీసుకొని పుణేలో ఉంటుంది. పవన్ తో జీవిస్తున్న సమయంలో జానీ సినిమాలో నటించింది, అలాగే ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కోసం చూస్తుంది.

ఇక ఆశ రాణి విషయానికి వస్తే ఆమె కూడా ఒకే ఒక్క సినిమాతో వెండి తెర నుండి దూరం అయ్యింది.కారణం ఆమె యాక్షన్ హీరో అర్జున్ తో ప్రేమలో పడటమే. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆశ ఒక్క సినిమాలో నటించి అతి చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని ఇద్దరి పిలల్లకు జన్మను ఇచ్చింది. ఈమె తన భర్త అయినా అర్జున్ కి ఫ్యాషన్ డిజైనర్ గా పని చేస్తుంది. ఇక ఆశ 20 యేళ్ళ తర్వాత సెకండ్ ఇనింగ్స్ ప్రారంభించబోతుంది.
 

ఇలా ఆశ మరియు రేణు ఒక్క సినిమాతోనే కెరీర్ ముగిసిపోగా, పెళ్లయ్యాక ఇద్దరు కుటుంబం కోసం జీవించారు. ఇక భర్తలకు ఫ్యాషన్ డిజైనర్లు గా మారి 2 దశాబ్దాల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు. అంతే కాదు వీరి అడుగు పెట్టిన మెట్టినిల్లు ఎంతో పెద్ద సినిమా ఫ్యామిలీస్ కావడం మరొక విశేషం

మరింత సమాచారం తెలుసుకోండి: