ముంబై భామ కాజల్ అగర్వాల్ ఎట్టకేలకు పెళ్లి చేసుకుని ఒక ఇంటికి అయింది. ఎంతోకాలంగా తనతో స్నేహం చేస్తున్న గౌతమ్ అనే ఒక వ్యాపారవేత్తని ఈ భామ పెళ్లి చేసుకుంది. పెళ్లికి ముందు పెళ్ళయ్యాక కూడా తాను సినిమాల్లో నటిస్తానని బహిరంగంగానే ప్రకటించింది ఈ భామ. అయితే మన తెలుగు సినిమా మార్కెట్ లో పెళ్లికి ముందు ఉన్న హీరోయిన్ వేరు పెళ్లి అయ్యాక ఉన్న హీరోయిన్ పేరు. ఎందుకంటే వారితో ఇంతకుముందు లాగా రొమాంటిక్ సీన్స్ ప్లాన్ చేయలేరు  దర్శకనిర్మాతలు. చేయడానికి ఆమె ఒప్పుకున్నా దాన్ని అంగీకరించడానికి ప్రేక్షకులు రెడీ గా ఉండరు కాబట్టి అంత సాహసం చేయరు మన దర్శక నిర్మాతలు.

సో ఇప్పుడు ఈ భామ సమంత బాటలో పయనించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎలా అయితే సమంత పెళ్లి అయ్యాక పూర్తిగా గ్లామరస్ పాత్రలకు పుల్ స్టాప్ పెట్టి కేవలం లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఒప్పుకుని చేస్తూ వెళ్ళిందో అలాగే ఈమె కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలని ఫిక్స్ అయిందని అంటున్నారు. అయితే ఇక్కడే పొరపాటు గా ఆలోచిస్తోంది కాజల్. వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొడుతున్న తరుణంలో సమంతనే అసలు సినిమాలు చేయాలా వద్దా అనే మీమాంసలో పడితే ఈమె సమంతను రోల్ మోడల్ గా తీసుకుని అలాంటి సినిమాలు చేయాలని ఫిక్స్ కావడం కాస్త ఇబ్బందికర విషయమే మరి.

 ఈ విషయంలో కాజల్ ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని ఆమె అభిమానులు కోరుతున్నారు. ఎందుకంటే సమంత లాంటి హీరోయిన్ తో పోలిస్తే కాజల్ క్రేజ్ కాస్త తక్కువనే చెప్పాలి. అదీకాక సమంతకు తెలుగులో ఒక సాలిడ్ సినిమా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. అంత సపోర్టు ఉన్నా ఆమె సినిమాలు బోల్తా కొట్టాయి అంటే ఈమె ఎటువంటి సపోర్ట్ లేకుండా సినిమాలు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎందుకైనా అలాంటి సినిమాలు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: