బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో ఎక్కువగా తెలియని ముఖాలే కంటెస్టెంట్లుగా వచ్చారు. వారిలో కూడా చూసుకుంటే బాగా పరిచయం ఉన్నది యాంకర్ లాస్య, అలాగే టీవీ న్యూస్ రీడర్ దేవి, అమ్మ రాజశేఖర్, జబర్దస్త్ అవినాష్, కరాటే కళ్యాణి లాంటి వారే. అయితే  ఇపుడు పదమూడు వారాలకు బిగ్ బాస్ సీజన్ షో చేరడంతో దాదాపుగా హౌజ్ లో ఉన్న వారంతా జనాలకు రిజిష్టర్ అయిపోయారు. వారు తమ టాలెంట్ తోనే ఓట్లు గెలుచుకుంటుంటున్నారు. అదే సమయంలో బయట తమకు ఉన్న పరిచయాలు ఫ్రెండ్స్ ద్వారా కూడా ఓటింగ్  శాతం పెంచుకుని హౌస్ లో కొనసాగుతున్నారు.

ఆ విధంగా చూసుకుంటే  బలమైన కంటెస్టెంట్ గా అవినాష్ ఉండాలి. అవినాష్ జబర్దస్త్ షో ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించాడు. అవినాష్ కామెడీకి ఫిదా అయిన వారు కూడా పెద్ద ఎత్తున ఉంటారు. అవినాష్ కచ్చితంగా టాప్ ఫైవ్ లో ఉంటాడని అని చెప్పేవారు. అంతే కాదు అవినాష్ విన్నర్ అవుతాడని కూడా ఒక దశలో వినిపించేది.  చూడబోతే అవినాష్ ఇపుడు ఎలిమినేట్ అయ్యేలా ఉన్నాడు.

దానికి ఈ కంటెస్టెంట్ చేసుకున్నదే ఎక్కువ అని అంటున్నారు. అవినాష్ నామినేషన్స్ కి మొదట్లో వెళ్ళకపోవడంతో ఆయన గ్రూప్  అంటూ బయట బలంగా రెడీ అవలేదని చెబుతున్నారు. ఎక్కువ సార్లు నామినేట్ అయిన వాళ్ళు మరింత స్ట్రాంగ్ అవుతారు. బిగ్ బాస్ లో గత సీజన్లు చూస్తే అదే అర్ధమవుతుంది. ఇక అవినాష్ సేఫ్ గేం మొదట్లో ఆడడంతో చివరలోకి వచ్చేసరికి నామినేషన్ లో ఉన్నా కూడా బయట మద్దతు అతనికి అనుకున్నంతగా దక్కడంలేదు.


ఇక చెప్పాలంటే జబర్దస్త్ టీం గట్టిగానే ఉంటుంది. మరి అవినాష్ కి వారి నుంచి ఎందుకు మద్దతు లభించడంలేదు అన్నది కూడా ప్రశ్నగా ఉంది.   మెగాబ్రదర్ నాగబాబు అవినాష్ కి మద్దతు ఇస్తూనే అభిజిత్ గెలవాలని కోరారు. దాంతో జబర్దస్త్  టీం మెంబర్స్ ఆలోచనలు కూడా మారాయా అన్న చర్చ వస్తోంది. జబర్దస్త్  టీం లీడర్ బుల్లెట్ భాస్కర్ అయితే తనకు అభిజిత్ గెలవాలని ఉందని చెప్పేశాడు. ఈ విధంగా జబర్దస్త్ టీం నుంచి ఆశించిన మద్దతు రాకపోవడంతోనే అవినాష్ 12వ వారం ఎలిమినేట్ అయి మరీ ఎవిక్షన్ పాస్ తో బయటపడ్డాడు అంటున్నారు. ఈ వారం అవినాష్ జాతకం తేల్చేసే  సీన్ ఉంది. మరి జబర్దస్త్ గా ఓట్లు పడితేనే ఈ కమెడియన్ హౌస్ లో ఉంటాడు. లేకపోతే ఇంటికే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: