తమ అభిమాన హీరోలకు సంబంధించిన ఏ చిన్న విషయాన్ని అయినా ఇట్టే సోషల్ మీడియాలో దాన్ని ట్రెండ్ చేస్తూ ఉంటారు ఫ్యాన్స్. ముఖ్యంగా స్టార్ హీరోల అభిమానులు ఈ విషయాల్లో కాస్త ముందుంటారనే చెప్పాలి. అయితే ఎప్పుడు కలిసికట్టుగా ఉంటూ తమ అభిమాన హీరో కి సంబంధించిన అప్డేట్స్ విషయంలో సోషల్ మీడియాలో ట్రెండ్స్ క్రియేట్ చేసే అభిమానులు.. ఈ సారి  మాత్రం ఫ్యాన్స్ రెండు వర్గాలుగా విడిపోయారు. ఒకర్నొకరు తిట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఈ వింత పరిస్థితి చోటుచేసుకుంది మన సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ గ్రూపుల మధ్య.ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. మహేష్ నటించిన సైనికుడు సినిమా సరిగ్గా 14 ఏళ్ల కిందట ఇదే రోజు విడుదలైంది.

గుణ శేఖర్ దర్శకత్వంలో సరిగ్గా 14 ఏళ్ల ముందు ఇదే రోజు వచ్చిన ఈ సినిమా అప్పట్లో డిజాస్టర్ గా నిలిచింది. దీంతో కొంతమంది మహేష్ అభిమానులు #14ఇయర్స్ సైనికుడు అంటూ ట్రెండింగ్ షురూ చేశారు.నిజానికి ఇదొక ఫ్లాప్ సినిమా అనే విషయం మహేష్ ఫ్యాన్స్ కి కూడా తెలుసు..అయితే ఇలాంటి సినిమాను ట్రెండ్ చేయొద్దంటూ మరో మహేష్ ఫ్యాన్స్ గ్రూప్ ప్రచారం అందుకుంది. దీంతో మహేష్ అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయారు.ఓ వర్గం మహేష్ ఫ్యాన్స్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా సైనికుడు సినిమాపై ప్రచారం స్టార్ట్ చేస్తే.. మరో వర్గం మహేష్ ఫ్యాన్స్ మాత్రం దాన్ని మరిపించేలా మహేష్ కొత్త ఫొటోలతో ట్రెండింగ్ మొదలుపెట్టింది.

ఏది ఎలాఉన్న ఒక హీరోకి సంబంధించిన వారి అభిమానులు అంతా కలిసికట్టుగా ఉంటే..వారి మధ్య ఎలాంటి గొడవలు ఉండవు కదా.. దానికి తోడు ఫ్యాన్స్ అంతా ఒక్కటిగా ఉంటే ఆ హీరో క్రేజ్ కూడ భారీగా పెరిగే అవకాశం ఉంది. మరి ఈ చిన్న లాజిక్ ని మన సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ ఎలా మిస్సయ్యారబ్బా..ఏది ఏమైనా హీరోలే కలిసి మంచి ఫ్రెండ్స్ షిప్ ని మెయింటైన్ చేస్తున్న ఈ రోజుల్లో.. వారి అభిమానులు ఇలా చేయడం సరికాదంటూ పలువురు నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు..ఇక మహేష్ సినిమాల విషయానికొస్తే.. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ' సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్నాడు మహేష్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: