గ్రేటర్ ఎన్నికల వార్ ఈరోజు ఉదయం ఏడు గంటలకు మొదలైంది.. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. నిర్ణీత సమయం లోపు  ఓటర్లు ఎవరి ఓటును వారు వినియోగించుకోవటం ఉత్తమం. అది ప్రతి ఓటరు యొక్క బాధ్యత మరియు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును కల్పించే అవకాశం కూడా, ఈ నేపథ్యంలో ప్రముఖ రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు సైతం ఓటు వేయడానికి పోలింగ్ బూత్ కు తరలి వస్తున్నారు. అయితే తన ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉత్సాహంతో... షూటింగ్ ఆపేసి మరి పరుగు పరుగున వచ్చారు నిర్మాత మరియు ప్రముఖ నటుడైన శివాజీ.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరులో షూటింగ్లో బిజీగా ఉన్న ఆయన షూటింగ్ మధ్యలోనే ఆపేసి 300 కిలోమీటర్ల దూరం ప్రయాణించి  ఓటు వేయడానికి వచ్చాను అంటూ పేర్కొన్నారు... ఓటు హక్కును కలిగి ఉన్న ప్రతి ఒక్క పౌరుడు తన ఓటును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ రకంగా ఒక సినీ ప్రముఖుడు తన షూటింగ్ ను నిలిపి వేసి మరి ఓటు వేయడం కోసం రావడం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు నిర్మాత, నటుడు అయిన శివాజీ.

ఇకపోతే గ్రేటర్లో 150 డివిజన్లకు గాను...1,122 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పోలింగ్ కోసం జంటనగరాల పరిధిలో 9,101 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు భద్రత సిబ్బంది మధ్య ఎలక్షన్ కొనసాగుతోంది....!!!జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని... పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉన్నామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు.... ఒకవేళ పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగితే.. తక్షణమే 9490617111 కు సమాచారం అందించాలని తెలిపారు. హైదరాబాద్‌లో 29 చెక్‌పోస్టులు ఎలక్షన్ సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: