కాజల్ పెళ్లి తరువాత కూడా నటిస్తుందా? లేదా? కాజల్ అభిమానులు ఈ విషయంలో తెగ కన్ఫ్యూజన్ కు గురవుతున్నారు. కొంతమంది హీరోయిన్స్ పెళ్లి తరువాత నటించాలని అనుకున్నా కూడా వారికి తగిన పాత్రలు రాకపోవడం, మరికొంతమంది సపోర్టింగ్ రోల్స్ కి పరిమితమవడం వంటి విషయాల వల్ల ఆడియెన్స్ కు ఈ కన్ఫ్యూజన్ కలగడం సహజమే. కొంతమంది హీరోయిన్స్ పెళ్లి తరువాత నిర్మాతగా మారడం అలాగే తెరవెనుక బాధ్యతలను స్వీకరించడం జరుగుతోంది. కాబట్టి, ఇవన్నీ కాజల్ పెళ్లి తరువాత కూడా సినిమాల్లో కెరీర్ ను కంటిన్యూ చేస్తుందా లేదా అన్న విషయంలో అభిమానులను కన్ఫ్యూజన్ కు గురిచేస్తున్నాయి.

సరే, అసలు విషయంలోకి వచ్చేద్దాం. కాజల్ కు తన లైఫ్ పార్ట్నర్ గౌతమ్ కిచ్లు కెరీర్ పరంగా ఫ్రీడమ్ ను ఇచ్చేశాడట. నువ్వు నటించవద్దు అని కండిషన్స్ ఏమీ పెట్టలేదట. దాంతో, ఈ అమ్మడు తనకంటే అదృష్టవంతురాలు ఎవరూ లేరు అని సంబరపడి తన లైఫ్ పార్ట్నర్ ను పొగడ్తలతో ముంచెత్తుతోంది. కెరీర్ కు పెళ్లి తరువాత గుడ్ బై చెప్పాల్సిన అవసరం లేనందుకు సంతోషిస్తోంది. ప్రస్తుతం, కాజల్ చేతిలో నాలుగైదు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయట.

అందుకే, కాజల్ ఈ షూటింగ్స్ లో పాల్గొనడం కోసం హైదరాబాద్ నుంచి చెన్నై కు బ్యాక్ టు బ్యాక్ జర్నీస్ తో బిజీగా ఉందని టాక్. షెడ్యూల్స్ కు ఓకే చెప్పేస్తోందట. కాజల్ యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటోందట. శంకర్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ (ఇండియన్ 2) కు దర్శకత్వం వహిస్తున్నాడు. ఐతే, ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లే టైమ్ ఇంకా ఖరారు కాలేదు. మరోవైపు,  దుల్కర్ సల్మాన్ తో కూడా క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తోందట. అంతేకాదు, మన తెలుగు డైరెక్టర్స్ చెప్పే కథలను కూడా వింటాడట ఈ చందమామ. ఈ విధంగా సౌత్ లో తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు ఈ అమ్మడు విపరీతంగా ఆరాటపడుతోంది తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: