నటి సుజాత..ఇప్పటి తరం ప్రేక్షకులకు కేవలం శ్రీరామదాసు వంటి సినిమాలతోనే పరిచయం. కానీ ఆమె అక్కినేని , సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ వంటి స్టార్ హీరోస్ సరసన హీరోయిన్ గా నటించి సౌత్ ఇండియా స్టార్ గా ఒక దశాబ్దం పాటు నటించిన సంగతి ఇప్పటి తరం ప్రేక్షకులకు పెద్దగా తెలియదు.1952 డిసెంబర్ 10 న మలయాళ కుటుంబంలో జన్మించిన సుజాత, తన 14 వ ఏటా సినిమా రంగంలోకి ప్రవేశించి గోరింటాకు వంటి సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకుంది.. తమిళ్, తెలుగు, కన్నడ వంటి పరిశ్రమలలో మూడు వందలకు పైగా సినిమాల్లో నటించింది.

సినిమాల్లో నటిస్తున్న సమయంలో ఇంటి ఓనర్ కొడుకుతో ప్రేమలో పడిన సుజాత అతడినే పెళ్లాడింది. సుజాత కి ఇద్దరు పిల్లలు. అమెరికా లో భర్తతో సెటిల్ అవ్వాల్సిన సుజాత అక్కడి వాతావరణం నచ్చకపోవడం తో ఇండియా కు వచ్చి మల్లి తిరిగి వెళ్ళలేదు. ఇక ఇండియా కి వచ్చాక తిరిగి సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది. భర్త వల్ల కొన్నాళ్ల పాటు ఇబ్బందులకు గురయిన సుజాత పిల్లలను ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసింది.

హీరోయిన్ సుజాత పరదేశపు పౌరసత్వం

నటి సుజాతను చూస్తే ఎవరైనా మన తెలుగు అమ్మాయి అనుకునేవారు అప్పట్లో కానీ ఆమె తండ్రి శ్రీలంక లో ఉద్యోగం చేస్తుండేవారు. సుజాత స్వతగహగా మలయాళీ, కానీ ఆమె పుట్టింది పెరిగింది మాత్రం ఇండియాలో కాదు. ఆమె శ్రీలంకలో లో గాలీ ప్రాంతంలో పుట్టింది . 15 యేళ్ళ వయసు వచ్చేదాకా అక్కడే పెరిగింది. సుజాతకి శ్రీలంక పౌరసత్వం కలిగి ఉంది. యుక్త వయసులో ఉండగా ఆమె తన కుటుంబం తో కేరళ వచ్చి స్థిరపడింది.  ఆరోగ్య సమస్యలతో 2011 లో కన్ను మూసింది. ఆమె చివరగా నటించిన చిత్రం శ్రీరామదాసు. 

మరింత సమాచారం తెలుసుకోండి: