అవును అండి మీరు చూస్తుంది నిజమే..పెళ్లి అంటే స్వర్గంలో నిర్ణయం జరుగుతుందట. అతిలోక సుందరి శ్రీదేవి వాళ్ళ అమ్మ జె డి చక్రవర్తి ని పిలిచి మరి తన కూతురిని పెళ్లి చేసుకొమ్మని అడిగిందట. కానీ ఆ మాట చెప్పగానే మనోడికి శ్రీదేవిని ఎప్పటి నుండో ప్రేమిస్తున్న ఆర్జీవీ గుర్తచ్చాడో ఏమో కానీ సున్నితంగా తిరస్కరించాడట. ఇక శ్రీదేవి అక్క కూతురు మహేశ్వరితో సైతం అప్పట్లో చక్రవర్తికి మంచి బంధం ఉండేదని తెగ వార్తలు వచ్చాయి. కానీ ఏమైందో ఏమో కానీ ఈ మ్యాటర్ ముందుకు వెళ్ళలేదు. ఇక పెళ్లి గిల్లి వద్దు అనుకున్నాడో ఏమో కానీ సినిమాలే జీవితం అనుకోని ముందుకు సాగాడు.

రామ్ గోపాల్ వర్మకు ప్రియా శిష్యుడిగా జె డి చక్రవర్తి కి మంచి పేరు ఉంది. ఈయన అస్సలు పేరు నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి. హీరో గా, విలన్ గా, దర్శకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మల్టీ ట్యాలెంట్ కలిగిన జె డి ఒకానొక సమయంలో ఫుల్ ఫామ్ లో కొనసాగాడు. గులాబీ, దెయ్యం,  అనగనగ ఒక్క రోజు, మృగం, ఎగిరే పావురమా , బొంబాయి ప్రియుడు , సత్య మరియు ప్రేమకు వేళాయరా వంటి సూపర్ హిట్ సినిమాలు ఈయన ఖాతాలో ఉన్నాయి. ఇక కెరీర్ గ్రాఫ్ డౌన్ అవుతున్న సమయంలో క్యారెక్టర్ నటుడిగా కూడా మంచి సినిమాల్లో నటించాడు.

ప్రస్తుతం జె డి చక్రవర్తి పెద్దగా సినిమాల్లో నటించడం లేదు. ఒక హీరోయిన్ తో లవ్ ఫెయిల్యూర్స్ కారణంగా జె డి చాల యేళ్ళ పాటు పెళ్ళికి దూరం అయ్యాడు. చివరికి 46 యేళ్ళ వయసులో 2016 లో అనుకృతి శర్మ ఐటెం హీరోయిన్ ని పెళ్లి చేసుకున్నాడు. వీరిది ప్రేమ వివాహం. రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా, జె డీ చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్న శ్రీదేవి అనే సినిమాలో అనుకృతి శర్మ నటిస్తున్న సమయం లో వీరి మధ్య ప్రేమ చిగురించింది. శ్రీదేవి లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోమ్మన్నా వద్దని ఒక ఐటెం గర్ల్ తో సెటిల్ అయిపోయాడు చక్రవర్తి.




 
 


మరింత సమాచారం తెలుసుకోండి: