ఒక్క సినిమా సూపర్ హిట్ ఇస్తే ఆ డైరెక్టర్ ఇంటి ముందు పెద్ద ప్రొడ్యూసర్లు క్యూ కడతారు మరియు స్టార్ హీరోలు. కానీ ఈ ఫార్ములా అందరికి వర్తించేలా కనబడటం లేదు. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన శర యేళ్ళ తరబడి వేచి చూడాల్సి వస్తుంది. ఎదో కాస్త అదృష్టం కలిసి వచ్చి ఇంకో సినిమా స్టార్ట్ చేసిన, షూటింగ్ లు పూర్తి చేయడం చాల కష్టం గా  ఉందట కొంత మంది దర్శకులకి. మరి ఆ బ్లాక్ బస్టర్ దర్శకులు ఎన్నాళ్ళ నుండి సినిమా చేయడం లేదో చూద్దాం పదండి.

మొదటగా సుకుమార్: రంగస్థలం 2018 లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. మధ్యలో మహేష్ బాబు తో చేయాల్సిన సినిమా పట్టాలెక్కలేదు. అల్లు అర్జున్ పుష్ప ఇంకో రెండేళ్లయినా కరోనా వల్ల విడుదల కాదు, మొత్తానికి ఒక 4 ఏళ్ళు సుకుమార్ వెయిట్ చేయాల్సిందే.

2) కొరటాల శివ: భరత్ అనే నేను హిట్ కొట్టి రెండేళ్లు అవుతుంది. చిరంజీవి ఆచార్య సినిమా కరోనా వల్ల ఇంకా కొబ్బరికాయ కొట్టించుకోలేదు. మరి ఇంకో రేడేళ్ళయినా ఈ సినిమా విడుదల అవ్వడం అనుమానమని అంటున్నారు. సో ఈ లెక్కన శివ సైతం 4 చూడాల్సిందే.

3) వంశీ పైడిపల్లి: పోయిన ఏడాది మహర్షి వచ్చి సూపర్ హిట్ అయ్యింది. కానీ ఇప్పటి వరకు కథ కూడా తయారు చేయలేదు వంశి. ఇంకో కథ ఎప్పుడు ఒకే అంటాడో, షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో ఇంకా రెండు ముడుఏళ్ళయితే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.  

4) పరశురామ్ :  గీత గోవిందం సినిమా 2018లో వచ్చి సూపర్ డూపర్ హిట్ అయ్యింది. మహేష్ బాబు తో సర్కారు వారి పాట అనుకున్న అది షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి. సో పరశురామ్ పరిస్థితి కూడా దాదాపు అంతే సంగతులు.

5) సందీప్ రెడ్డి వంగా : అర్జున్ రెడ్డి వచ్చి ఇప్పటికే మూడేళ్లయింది. ఇంకా ఇప్పట్లో మరో సినిమా వచ్చే అవకాశం కనిపించడం లేదు.

6) అజయ్ భూపతి : rx 100 వచ్చి రెండేళ్లు అయ్యింది.  శర్వానంద్ -సిద్దార్థ్ లతో మహా సముద్రం అనే మూవీ అనుకుంటున్నా ఇంకా అది అధికారిక ప్రకటన చేయలేదు. మినిమం ఇంకో మూడేళ్లు ఆగితే కానీ అజయ్ సినిమా బయటకు రాదు.

7) శేఖర్ కమ్ముల: ఫిదా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఇప్పటికే మూడేళ్లు అయ్యింది. నాగ చైతన్యతో ‘లవ్ స్టోరీ’ తీస్తున్న అది ఎప్పటికి అవుతుందో తెలియని పరిస్థితి.

ఇదండి మన హిట్ నిర్మాతల పరిస్థితి

మరింత సమాచారం తెలుసుకోండి: