నితిన్ ఇండస్ట్రీ హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో .. గత చిత్రం భీష్మ తో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్న నితిన్ వరుస చిత్రాలతో బిజీ అయ్యాడు .. అయితే నితిన్ తొలిసారి ఒక వాణిజ్య ప్రకటనలో నటించారు.. ఆ ప్రకటన విశేషాలు  ఏంటో ఇప్పుడు చూద్దాం .  నితిన్ కొన్ని నెలల ముందు  తాను ఒక వాణిజ్య ప్రకటనలలో  నటిస్తున్నానని  ప్రకటించిన విషయం తెలిసిందే.. తాజాగా ఈ యాడ్ కి సంబంధించిన కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి..

 అయితే ఈ ఫోటోలోని గమనిస్తే చూస్తే నితిన్ ఏదో  పెద్ద బట్టల కంపెనీకి చెందిన ప్రకటనలో నటిస్తున్నారని తెలుస్తుంది. కానీ అది వట్టి మాటలే అని తర్వాత అర్థం అయ్యింది .. నితిన్ పేరు గాంచిన డ్రెస్  ప్రకటనలో నటించడం లేదట  తాను  హైదరాబాద్ కు చెందిన స్నేహ ఫ్రెష్ చికెన్ బ్రాండ్  ప్రకటనలో  నటించారని  తెలుస్తుంది.. దానికి సంబంధించిన వీడియో ఒకటి ఈరోజే  యూట్యూబ్ లో విడుదల  అయ్యింది . ఇందులో నితిన్ స్నేహ చికెన్ ని  ప్రమోట్ చేసే పాత్రలో  నటించారు..

నితిన్ పర్ఫార్మెన్స్,దర్శకుడి ప్రతిభ మరియు విజువల్  ఎఫెక్ట్స్  ఈ యాడ్  అద్భుతంగా వచ్చేలా చేశాయి అని  స్నేహ ఫ్రెష్ చికెన్ ఎండి అన్నారు .. సాహో సినిమా అసోసియేట్ డైరెక్టర్ గా చేసిన అనిల్ కుమార్ ఈ ప్రకటన కి దర్శకత్వం వహించారు..

ఈ ప్రకటన ఆద్యంతం ఆసక్తితో ఉంటుంది ..అలాగే నితిన్ కి తల్లి పాత్రలో నటి ప్రగతి నటించారు ..   విజువల్ ఎఫెక్ట్ తో ఈ ప్రకటన అందరినీ ఆకట్టుకుంటుందని తిన్నావా అంటూ వచ్చే పాట ఈ ప్రకటన కి హైలెట్ అని దర్శకుడు
అన్నారు ..  ..తిన్నావా అనే పదం సోషల్ మీడియా లో ఎలా వైరల్ అయ్యిందో మనందరికీ తెలుసు .. అదే పదాన్ని మేము  ఈ పాటలో ఉపయోగించమని దర్శకుడు తెలిపారు ..

నితిన్ ప్రస్తుతం రంగ్ దే ఈ సినిమాలో నటిస్తున్నారు.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఆ చిత్రం రూపొందుతుంది  .. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది...సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల చేయబోతున్నట్లు  మూవీ టీం ప్రకటించింది  ..  సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాను
నిర్మిస్తున్నారు ..


మరింత సమాచారం తెలుసుకోండి: