సుదీర్ఘ కాలం పాటు కెరీర్ కొనసాగిస్తూ నెంబర్ వన్ హీరోగా మెగాస్టార్ తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. నిన్నటి తరం హీరో లకు నేటి తరం హీరోలకు వారధిగా ఉంటూ అందరికి గట్టి పోటీని ఇస్తున్నాడు. చిరంజీవి సినిమా ఉందంటే చాలు అభిమానులకు అన్ని పండగలు కలిసి వచ్చినట్టే. ప్రస్తుతం ఆచార్య చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ తో కలిసి చేస్తున్న చిరంజీవి తన కెరీర్లో ఇప్పటికే 151 చిత్రాలు పూర్తి చేసాడు. ఈ సంగతి పక్కన పెడితే చిరంజీవి కెరీర్ లో బయటకు తెలియని కొన్ని విషయాలు ఉన్నాయ్. అయన మెచ్చిన కొన్ని కథలు షూటింగ్ పూర్తి చేసి కూడా విడుదల కాలేదు. అలాగే కొన్ని షూటింగ్ దశలో ఆగిపోయాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం.

మెగాస్టార్ ముచ్చట పడ్డ 10 సినిమాలు

ఇద్దరు పెళ్లాల సబ్జెక్టు లైన్ తో దివ్యభారతి హీరోయిన్ గా మొదలయిన సినిమా మధ్యలోనే ఆగిపోయింది. అలాగే వజ్రాల దొంగ అనే మరో సినిమా శ్రీదేవి తో కలిసి చేయాల్సింది. అది కూడా పట్టాలెక్కకుండా ఆగిపోయింది. ఈ రెండు చిత్రాలకు కోదండ రామి రెడ్డి దర్శకుడిగా మొదలు పెట్టారు. ఇక మూడో సినిమా మనసంతా నువ్వే. వి.ఎన్. ఆదిత్య దర్శకత్వంలో చిరు చేయాల్సిన ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. కానీ ఉదయ్ కిరణ్ తో చేసి హిట్ కొట్టాడు దర్శకుడు. అబూ బాగ్దాద్ గజదొంగ అనే చిత్రం సురేష్ కృష్ణ డైరెక్షన్లో మొదలవ్వగా మధ్యలోనే అటకెక్కింది. ‘వినాలని వుంది’ అనే పేరుతో రామ్ గోపాల్ వర్మ-చిరంజీవి కాంబినేషన్లో మొదలయిన సినిమా సైతం మధ్యలోనే ఆగిపోయింది.  భూలోక వీరుడు అనే సినిమా సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో చిరంజీవి చేయాల్సి ఉండగా ఇది సైతం మధ్యలోనే ఆగిపోయింది. ఇక తారక్ నటించిన ఆంధ్రావాలా సినిమా మొదట చిరంజీవి చేయాల్సి ఉంది. కానీ ఏవో కారణాల చేత అది తారక్ తో చేయించాడు పూరి జగన్నాద్. ఇక వీరి కంబినేషన్లో మరొక సినిమా ఆటో జానీ అనుకున్నారు. ఇది కూడా మొదలవకుండానే ఆగిపోయింది. ఇక చిరంజీవి నటించాల్సిన శాంతి నివాసం, వడ్డికాసులవాడు వంటి మరో రెండు చిత్రాలు సైతం మొదలవ్వకుండానే ఆగిపోయాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: